పేద విద్యార్థులకు అందని ద్రాక్షగా విద్య..
50 శాతం సబ్జెక్ట్ పాస్ అవ్వాలి 75% హాజరు శాతం ఉండాలి అనే నిబంధనలను విరమించుకోవాలి..
ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ విడుదల చేయాలి…
విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి..
తెలంగాణ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి గొల్లపెల్లి చంద్రశేఖర్..
నవతెలంగాణ – జన్నారం
విద్యార్థులకు విద్యను దూరం చేసే ఆలోచనలను మానుకోవాలని పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని టి ఎస్ యు రాష్ట్ర కార్యదర్శి గొల్లపెల్లి చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రధాన రహదారిపై విద్యార్థులతో కలిసి రాస్తారోకో చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యారంగంలో మార్పు తీసుకొచ్చి ఆలోచనలు తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయంబర్స్మెంట్ స్కాలర్షిప్ లలో కోత విధించే ఆలోచన విరమించుకోవాలన్నారు.
విద్యారంగ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి రాగానే విద్యార్థులకు ఏదో న్యాయం చేస్తానని కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాక విద్యార్థుల పట్ల సిఎం రేవంత్ రెడ్డి సవితి తల్లి ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు..అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పిన సీఎం ఇప్పటివరకు రాష్ట్రంలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో వివరించాలన్నారు. ఉద్యోగాలు ఇవ్వడం కాదు కదా విద్యార్థులను విద్యకు దూరం చేసే ఆలోచనలో రేవంత్ రెడ్డి పేద విద్యార్థులకు ఎంతగానో అండగా ఉన్నా ఫీజు రియంబర్స్మెంట్ ఆనాటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పేద విద్యార్థుల కోసం విద్యను అందించుటకు ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఫీజు రియంబర్స్మెంట్ ఈ పథకం ద్వారా ఎంతోమంది పేద విద్యార్థులు చదువుకు దూరం కాకుండా విద్యను అభ్యసిస్తున్నారు.
ఇలాంటి పథకంపై ఈ ప్రభుత్వం విద్యార్థులను విద్యకు దూరం చేయాలనే ఆలోచనతో 50% పాస్ అవ్వాలి 75% హాజరు శాతం ఉండాలని కొత్త నిబంధన తీసుకొచ్చి ఆలోచనలు సర్కారు ఆలోచిస్తుంది ఈ నిబంధన వల్ల పేద మధ్యతరగతి విద్యార్థులకు ఎంతగానో అన్యాయం జరుగుతుంది ఈ ఆలోచనను వెంటనే విరమించుకోవాలి లేనిపక్షంలో విద్యార్థులందరూ ఏకమై ప్రభుత్వాన్ని గద్ద దించే వరకు ఊరుకోమన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు విడుదల చేయకుండా 8000 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయన్నారు. ఇది విడుదల చేయకుండా ఇచ్చేవాటిని దూరం చేస్తానంటే విద్యార్థులు ఎలా ఊరుకుంటారన్నారు. రానున్న కాలంలో విద్యార్థులు తలుచుకుంటే ప్రభుత్వాన్ని కూలగొట్టడం పెద్ద సమస్య కాదని విద్యార్థులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం నిలబడ్డట్టు దాఖలాలు లేవని హెచ్చరించారు. హాస్టల్లో పరిస్థితులకు విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
గురుకులాలూ, కేజీబీవీీ లు ప్రభు త్వ పాఠశాలలో క్రమం తప్పకుండా ఫుడ్ పాయిజన్ సంఘటనలు చోటు చేసుకుంటున్నప్పటికీ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుందని ఎద్దేవ చేశారు, ఒకవైపు ఫీజు ప్రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమయ్యే ప్రమాదం పొంచి ఉందన్నారు, ఇంజనీరింగ్ కళాశాలలకు డిగ్రీ మరియు ఇంటర్మీడియట్ కళాశాలలకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రాకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిని నియమించడంతోపాటు విద్యారంగాన్ని చక్కదిద్దాలని డిమాండ్ చేశారు, పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని కోరారు.
యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు, ప్రభుత్వ హాస్టల్లో మౌలిక వసతులు కల్పించడంతోపాటు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని డిమాండ్ చేశారు, ప్రభుత్వం ఈ డిమాండ్లు పరిష్కరించని పక్షంలో టి ఎస్ యు విద్యార్థి సంఘం తరపున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. బిజెపిని నాయకులు బద్రీ నాయక్, విద్యార్థి సంఘ నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు.