మండల వ్యవసాయ శాఖ అధికారి డి మల్లేష్..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
రసాయన యూరియా కంటే నానో యూరియాతో ఎంతో లాభం అని, పోషక విలువలు ఎక్కువ అని, రైతులు నానో ఏరియా వైపు మొగ్గు చూపాలని మండల వ్యవసాయ శాఖ అధికారి డి మల్లేష్ అన్నారు. శుక్రవారం మండలంలోని రెడ్డి నాయక్ తండ గ్రామంలో రైతు గుగులోతు హీరోలాల్ వ్యవసాయ క్షేత్రం లో నానొ యూరియా, నానో డి ఏ పి వాడకాన్ని భువనగిరి మండల వ్యవసాయ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నానో యూరియా వాడకం వల్ల దిగుబడిలో అద్భుత ప్రయోజనాలు ఉన్నాయని అత్యంత ప్రయోజన కరిణిగా ఉన్న నానో యూరియాని రైతులు వాడే విధంగా చూడాలన్నారు. నానో యూరియా అనేది నానోటెక్నాలజీ సహాయంతో తయారు చేయబడిన ద్రవ రూపంలో ఉండే ఎరువు అని, నానో వాడకం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు నానో యూరియా మొక్కలకు సమర్థవంతంగా నత్రజనిని అందిస్తుందని , పంట దిగుబడిని పెంచడంలో సహాయపడుతుందన్నారు
సాంప్రదాయ యూరియా వాడటం వల్ల పర్యవరణ కాలుష్యం, భూగర్భ జల వనరులకు ఇబ్బంది కలగడమే కాకుండా , నేలకు కూడా చాలా నష్టం కలుగుతుందన్నారు. సాంప్రదాయ యూరియాతో పోలిస్తే నానో యూరియా తక్కువ మొత్తంలో వాడడం వల్ల..ఇది మట్టి, నీటి కాలుష్యాన్ని తగ్గిస్తుందన్నారు. అధిక దిగుబడి తో పాటు మెరుగైన పోషక విలువలతో కూడిన పంటలను పండించడానికి నానో యూరియా సహాయపడుతుందన్నారు. నానో యూరియా ద్రవ రూపంలో ఉండటం వల్ల, రవాణా, నిల్వ చేయడం సులభతరమన్నారు.
పంటలకు రసాయన ఎరువులు వేస్తేనే దిగుబడులు వస్తాయన్న ఆలోచనలో రైతులు ఉన్నారని, పంట ఆరోగ్యం, నాణ్యమైన ఉత్పత్తికి పచ్చిరొట్ట, సేంద్రియ, జీవన ఎరువులు ఎలా ఉపయోగపడతాయో నానో యూరియా కూడా అంతేనని అన్నారు. అనంతరం యూరియా సరఫరా గురించి మాట్లాడుతూ.ఇప్పటివరకు ఆగస్టు మాసం అవసరం మేరకు ఎరువుల సరఫరా చేయడమైనది ప్రస్తుతం భువనగిరి మండలంలో 100 మెట్రిక్ టన్నుల యూరియా సింగిల్ విండో సొసైటీ, ఆగ్రో రైతు సేవ కేంద్రాలు, మరో 100 మెట్రిక్ టన్నులు ప్రైవేట్ డీలర్స్ వద్ద అందుబాటులో ఉండడం జరిగింది కావున రైతు సోదరులు అవసరం మేరకే యూరియాని వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారిని ప్రియాంక, రైతులు గుగులోత రాలాల్, రాజు లు పాల్గొన్నారు.