నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని నాగాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో శుక్రవారం ఉత్తమ ఉపాధి కూలీ, పంచాయతీ సిబ్బందికి సన్మానం చేశారు. శుక్రవారం గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకంలో మొట్టమొదట 100 రోజుల ఉపాధి కూలీ పని పూర్తి చేసుకున్న ఉల్లెంగుల దశరథ్, గ్రామ పంచాయతీలో ఉత్తమ పారిశుద్ధ్య కార్మికునిగా సేవలందిస్తున్న వాటర్ మెన్ దానే ముత్యన్న లను సత్కరించారు. ఈ సందర్భంగా ఇరువురికి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి ఖాందేశ్ సంధ్య, మాజీ ఉప సర్పంచ్ కంపదండి అశోక్, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు బసిరి అశోక్, ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ రాజేశ్వర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలెపు రాజేశ్వర్, గ్రామ పంచాయతీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
ఉత్తమ ఉపాధి కూలీ, పంచాయతీ పారిశుద్ధ్య కార్మికునికి సన్మానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES