– పలు పనులకు శంకుస్థాపనలు చేసిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ ఆలీ
నవతెలంగాణ – కామారెడ్డి
గ్రామ గ్రామాన పనుల జాతర ను శుక్రవారం మాచారెడ్డి మండలంలోని పలు గ్రామాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రభుత్వ సలహాదారు పలు పరుగులకు శంకుస్థాపనలు చేశారు. సర్దపూర్ తండాలో గ్రామపంచాయతీ భవననికి 20 లక్షలు, నెమలిగుట్ట తండా లో అంగన్ వాడి భవననికి 12 లక్షల రూపాయలు, మర్రి తాండలో గ్రామపంచాయతీ భవననికి 20 లక్షల రూపాయలు, గుంటి తాండ లో గ్రామపంచాయతీ భవననికి 20 లక్షలు, వడ్డెర కాలనీ లో గ్రామ పంచాయతీ భవనానికి 20 లక్షల రూపాయలు, వెనుకతాండలో అంగన్ వాడి భవననికి 12 లక్షల రూపాయలు, అలాగే పాల్వంచ మండలం వాడి గ్రామంలో గ్రామపంచాయతీ భవననికి 20 లక్షల రూపాయలు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు, ఇండ్ల పనుల ప్రారంభం, ఆహార భద్రత కార్డులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ ఈరోజు గ్రామ గ్రామాన తిరుగుతుంటే ప్రజల కళ్ళల్లో ఆనందం కనిపిస్తుందనీ, 10 సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో ప్రజలు మనోవేదనకు గురయ్యారన్నారు. సమస్యలు చెప్పుకుందామంటే నాయకులు గ్రామాల్లోకి వచ్చేవారు కాదు ఎవరైనా సమస్యలు చెప్పుకుందామంటే బెదిరింపులకు గురి అయ్యేవారనీ, బిఆర్ఎస్ పాలనలో పది సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు రాలేదనీ పేదలకు ఇల్లు రాలేదు బిఆర్ఎస్ నాయకులు మాత్రం లక్షాధికారులు అయ్యారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల ప్రభుత్వం వారి అభ్యున్నతికి కృషి చేస్తుందనీ,
రేవంత్ రెడ్డి పేద ప్రజల పక్షాన పోరాటం చేస్తూ వారికోసం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందిరమ్మ కలలను సహకారం చేస్తూ తెలంగాణలో ఇల్లు లేని నిరుపేదలు ఉండకూడదని ప్రతి ఒక్కరికి ఇల్లు అందేలా చూస్తామన్నారు. తొమ్మిది రోజుల్లో 9,000 కోట్లు రైతు భరోసా అందించి రైతులను ఆదుకున్నాం అన్నారు. రైతు భీమా అందిస్తున్నాం అని సకాలంలో వారికి ఎరువులు అందించే ప్రయత్నం చేస్తున్నాం అన్నారు. నిరుపేదలకు నియోజకవర్గానికి 3500 ఇంద్రమ్మ ఇండ్లను అందిస్తున్నాం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము పథకాన్ని అమలు చేస్తున్నాం అన్నారు. 200 యూనిట్ వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం, 500 కే వంట గ్యాస్ అందిస్తున్నాం, ఉచితంగా నిరుపేదలకు సన్న బియ్యం చౌక ధర దుకాణల ద్వారా అందిస్తున్నము అని,
మహిళా సంఘాలకు మహిళ సమైక్యలకు పెద్ద ఎత్తున నిధులు అందిస్తూ వాళ్లను కోటీశ్వరులను చేసే ప్రయత్నం చేస్తున్నాము అన్నారు. పేదలకు వైద్యం కొరకు 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అందిస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నర్సింగరావు, పల్లె రమేష్ గౌడ్, గణేష్ నాయక్, బ్రహ్మానందరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, బీబీపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుతారి రమేష్, ఇంద్ర సేనా రెడ్డి, స్వామి, నరసింహారెడ్డి, రాజు నాయక్, కొమురయ్య, రమేష్, లక్ష్మీరాజ్యం, చంద్ర నాయక్, దేవి సింగ్, రాము, తదితరులు పాల్గొన్నారు.