Saturday, August 23, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పల్లెల్లో పనుల జాతర షురూ..

పల్లెల్లో పనుల జాతర షురూ..

- Advertisement -

నవతెలంగాణ – రాయపర్తి
నిరుపేద కూలీల కుటుంబాలకు జీవనోపాధి పెంచేలా ‘పనుల జాతర-2025’ కార్యక్రమాన్ని శుక్రవారం  ఎంపీడీఓ కిషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంఎన్ఆర్ఆజీఎస్) పేదలకు పని కల్పనకే పరిమితం కాకుండా, గ్రామీణ సమాజానికి శాశ్వత ఆస్తులను సృష్టించేందుకు దోహదపడుతోంది అన్నారు. ఈ మేరకు పనుల జాతర కార్యక్రమం ద్వారా వేలాది మందికి పని కల్పించడం సాధ్యమవుతుందని వివరించారు. ఇందులో గ్రామపంచాయతీ, అంగన్‌వాడీ భవనాలు, స్వచ్ఛ భారత్ మిషన్(గ్రామీణ) ద్వారా నిర్మించిన సెగ్రిగేషన్ షెడ్లు, కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌లను వంటి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. వర్షపు నీటిని సంరక్షించి, భూగర్భ జలాలను పెంపొందించేందుకు ఉద్దేశించిన జలనిధి పథకం ద్వారా చేపట్టనున్న పనులకు కూడా ఉన్నాయి అన్నారు.

ఇందిరా మహిళా శక్తి – ఉపాధి,  ప్రధానంగా పశువుల కొట్టాలు, కోళ్లు, గొర్రెల షెడ్లు, వానపాములతో మందుల తయారీ కేంద్రాలు, అజోలా పిట్ నిర్మాణాలు ఉన్నాయి అని తెలిపారు. మహిళల ఆదాయాన్ని పెంచి, వారి ఆర్థికాభివృద్ధికి బాటలు వేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాయపర్తి మండలంలో సుమారు  2,41,75,642 పనులు ప్రారంభించుటకు ప్రణాళిక రూపొందించడం జరిగిందన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి రెండు కోట్ల ఎనిమిది లక్షల 36 వేలకు సంబంధించిన పనులు, స్వచ్ఛభారత్ గ్రామీణ్ నుండి 33 లక్షల 38 వేలు  సంబంధించిన పనులను ప్రారంభించే విధంగా ప్రణాళిక రూపొందించడం జరిగింది అని వివరించారు.  ఈ కార్యక్రమంలో ఎంపీఓ కూచన ప్రకాష్, ఏపీఓ కుమార్, ఇల్లంంద మార్కెట్ మాజీ వైస్ చైర్మన ముద్రబోయిన వెంకటేశ్వర్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, గ్రామాల ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad