నవతెలంగాణ-పెద్దవంగర
మండలంలోని పోచంపల్లి, కాన్వాయిగూడెం, కొరిపల్లి, చిట్యాల గ్రామాలకు చెందిన తంగెళ్లపల్లి సోమేశ్వర చారి, సుధగాని కొండయ్య, ముత్త మల్లయ్య, చెన్న నర్సమ్మ, తాండాల మంజుల, నీరటి బిక్షం, తోట సుజాత లు ఇటీవల వేరువేరు కారణాలతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుక్రవారం బాధిత కుటుంబాలను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కార్యకర్తల కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. ఆయన వెంట మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, సీనియర్ నాయకులు పాలకుర్తి యాదగిరి రావు, మండల ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ సంజయ్ కుమార్, శ్రీరాం సుధీర్, యూత్ మండల అధ్యక్షుడు కాసాని హరీష్, ఆంజనేయులు, అనపురం రాజు తదితరులు ఉన్నారు.
బాధిత కుటుంబాలకు ‘ఎర్రబెల్లి’ పరామర్శ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES