ఎంపీడీవో శంకర్ నాయక్
నవతెలంగాణ – చారకొండ
జాతీయ ఉపాధి హామీ పథకంలోని పనులను జాతరలాగా నిర్వహించాలని ఎంపిడిఓ శంకర్ నాయక్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో పనుల జాతర గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఉపాధి హామీ పనుల జాతర గ్రామసభలు నిర్వహిస్తున్నామన్నారు. ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు కలిగిన చిన్న,సన్న కారు రైతులకు వ్యక్తిగత జీవనోపాధి కొరకు వర్మీ కంపోస్ట్ ,గోట్ షేడ్, పండ్ల తోటల పెంపకం, పౌల్ట్రీ , నిర్మాణం చెక్ డాంలు నిర్మాణం, తదితర పనులు ఉపాధి హామీ పథకం ద్వారా పూర్తి చేసుకునే అవకాశం ఉందన్నారు. జాబ్ కార్డు కలిగి రైతులు పనుల జాతర పనులను సద్వినియోగం చేసుకోవాలన్నారు .ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి గణేష్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బలరాం గౌడ్ , చారకొండ ఎస్సై శంషుద్దీన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గుండె వెంకటయ్య గౌడ్, ఫీల్డ్ అసిస్టెంట్ రాధమ్మ, ఆశా వర్కర్స్ , ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి హామీ పథకంలో పనులను జాతరలా నిర్వహించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES