Saturday, August 23, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పనుల జాతరను ప్రారంభించిన ఎమ్మెల్యే తోట

పనుల జాతరను ప్రారంభించిన ఎమ్మెల్యే తోట

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పనుల జాతర (పనుల ప్రారంభోత్సవం, కొత్తగా చేపట్టే పనుల భూమి పూజ) కార్యక్రమంలో భాగంగా ఈరోజు జుక్కల్ మండలం ఖండేబల్లూర్ గ్రామంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అభివృద్ధి పనులకు  భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి, ఉపాధి కల్పన, పల్లెల్లో మౌలిక వసతుల విస్తరణ లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా రూ.2,198.83 కోట్ల వ్యయంతో 1,01,589 అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్స్, పొలాలకు మట్టి రోడ్లు, చెక్ డ్యామ్ లు, ఊట కుంటల నిర్మాణం, గ్రామీణ రహదారులు,పశువుల పాకలు, గొర్రెల షెడ్లు, సెగ్రిగేషన్ షెడ్లు, కంపోస్ట్ గుంతలు, కోళ్ల ఫారాల నిర్మాణం,నర్సరీల పెంపకం,అంగన్వాడీ, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలు తదితర పనులు చేపడతామన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఖండేబల్లూర్ గ్రామ మాజీ ఉప సర్పంచ్ గోవింద్ ఈరోజు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ మండల కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad