Friday, August 22, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పడంపల్లి హెచ్ ఎంకు ఘన వీడ్కోలు..

పడంపల్లి హెచ్ ఎంకు ఘన వీడ్కోలు..

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
మడంపల్లి ఎంపియుపిఎస్ ప్రభుత్వ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడిగా నిరంతరంగా ఏడు సంవత్సరాలు విధులు నిర్వహించిన హెచ్ఎం లాలయ్య బదిలీ అవుతున్నారు. ఇందులో భాగంగా పడంపల్లి గ్రామం నుండి ఖండేబల్లూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు పదోన్నతిపై వెళ్తున్న క్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, గ్రామస్తుల ఆధ్వర్యంలో లాలయ్యను అభినందిస్తూ ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయనకు జ్ఞాపికను అందజేశారు. ప్రధానోపాధ్యాయినిగా విధులు చేపట్టిన నాటినుండి నిరంతరంగా విద్యాభివృద్ధికి కృషిచేసి, ఏడు సంవత్సరాలు ఒకే పాఠశాలలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తూ రికార్డు బ్రేక్ చేశారని గ్రామస్తులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాఠశాల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad