- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని పడం పల్లి గ్రామంలో ఎడ్ల పొలాల అమావాస్య పండుగని రైతన్నలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం గ్రామంలో పశువులను ఎడ్ల పొలాల అమావాస్య పండుగ సందర్భంగా మూగజీవాలకు అలంకరణ చేసి గ్రామ దేవతలకు పూజలు నిర్వహించి భాజ భజంత్రీలతో ఊరేగింపుగా గ్రామంలోని దేవాలయంలో చుట్టూ ప్రదక్షిణలు చేయించి కాడేడ్లకు వివాహ కార్యక్రమం రైతన్నలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా రైతు ప్రశాంత్ పటేల్ మాట్లాడుతూ.. రైతుల జీవనాధారానికి గ్రామ దేవతలను, పాడి పశువులను పూజించే గొప్ప పండుగ అని పేర్కొన్నారు. ఈ పండుగ కార్యక్రమంలో గ్రామస్తులు , రైతులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -