నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని లాడే గావ్ గ్రామంలో బీఆర్ఎస్ యువ నాయకుడు రాజశేఖర్ పటేల్ ఆధ్వర్యంలో ఎడ్ల పొలాల అమావాస్య పండుగను కుటుంబ సమేతంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాడి పశువులకు ఉదయం స్నానం చేయించిన అనంతరం రంగురంగులు కలర్లతో ముస్తాబు చేసి జూలుతో అలంకరణ చేసి భాసింగలు , తాయెత్తులు , గొండలు , కట్టి కాడెడ్లకు అలంకరిస్తారు. అనంతరం గ్రామస్తులతో కలిసి గ్రామంలోని దేవాలయం వద్ద ఐదు ప్రదక్షణలు వేసి కార్డేడ్లకు ఆవుతో వివాహ కార్యక్రమం నిర్వహిస్తారు. బంధుమిత్రులను ఆహ్వానించి రైతులు విందు , భోజనాలు అరగించి ఉల్లాసంగా ఉత్సాహంగా ఎడ్ల పొలాల అమావాస్య పండుగను నిర్వహిస్తారు. గ్రామ దేవతలకు పాడి పశువులకు పూజించే గొప్ప మహోన్నతమైన పండుగనని రైతు రాజశేఖర్ పటేల్ అన్నారు. ప్రత్యేక నిష్ట నియమాలతో ఈ పండుగను నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ ఎడ్ల పొలాల అమావాస్య కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అశ్విని రాజశేఖర్ పటేల్, రైతు కుటుంబీకులు, తదితరులు పాల్గొన్నారు.
లాడే గావ్ లో ఘనంగా ఎడ్ల పొలాల అమావాస్య పండుగ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES