Saturday, August 23, 2025
E-PAPER
spot_img
Homeఖమ్మంవయ్యారి భామ (పార్థీనియం) నివారణపై విద్యార్ధులకు అవగాహన 

వయ్యారి భామ (పార్థీనియం) నివారణపై విద్యార్ధులకు అవగాహన 

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
వయ్యారి భామ(పార్థీనియం) కలుపు మొక్కతో వచ్చే దుష్ప్రభావాలు, నివారణ పై నారంవారిగూడెం పీఎం శ్రీ పాఠశాల విద్యార్ధులకు శుక్రవారం హెచ్ ఆర్ ఎస్ సైంటిస్ట్ అండ్ హెడ్ విజయ్ క్రిష్ణ అవగాహన కల్పించారు. శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం కు చెందిన స్థానిక ఉద్యాన పరిశోధనా స్థానం ఆద్వర్యంలో లో మోజర్ల ఉద్యాన కళాశాల నాలుగో సంవత్సరం విద్యార్ధులు పాఠశాలను సందర్శించారు.

ఈ సందర్భంగా కలుపు మొక్క ఉనికి,విస్తృతి,ఈ కలుపు మొక్కను అరికట్టే విధానాలను పాఠశాల విద్యార్థులకు, సిబ్బందికి వివరించారు. పాఠశాల,గ్రామం లోని ఇళ్ళ పరిసరాలలో గల కలుపు మొక్కలను తొలగించారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన పరిశోధనా స్థానం  విస్తరణ అధికారి విజయ్, ప్రధానోపాధ్యాయులు పి.చంద్రశేఖర్ రావు, ఉపాధ్యాయులు డాక్టర్ కే. శ్రీనివాసరావు,సిబ్బంది, మోజర్ల ఉద్యాన కళాశాల నాల్గవ సంవత్సరం విద్యార్థులు,గ్రామస్థులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad