Saturday, August 23, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్తెలంగాణ పనుల జాతర షురూ.!

తెలంగాణ పనుల జాతర షురూ.!

- Advertisement -

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు..
నవతెలంగాణ – మల్హర్ రావు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వివిధ పథకాల క్రింద మంజూరు చేయబడిన అభివృద్ధి పనులను శుక్రవారం ప్రజాప్రతినిధులు, అధికారులు పనుల జాతర కార్యక్రమాలకు భూమిపూజ నిర్వహించి ప్రారంభించారు. గ్రామాల్లో భూమి పూజ మంజూరు పత్రాలు అందజేసి,వనమహోత్సవం ఉపాధి హామీ పథకంలో పాల్గొన్న హక్కుదారులకు గుర్తించి వారికి సన్మానము, పరిశుద్ధ కార్మికులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.జిల్లా కలెక్టర్ మరియు అధికారుల ఆదేశాల మేరకు అన్ని గ్రామ పంచాయతీల్లో ఉత్సాహంగా పనుల జాతర నిర్వహించడం జరిగిందన్నారు.

ఇందులో భాగంగా తాడిచెర్ల గ్రామపంచాయతీలో మంజూరు చేయబడిన సామూహిక మరుగుదొడ్డి సముదాయం (కమ్యూనిటీ సానిటరీ కాంప్లెక్స్) పనిని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ దండు రమేష్ చే ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించనైనదని తెలిపారు. రమేష్  మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో వ్యక్తిగత పనులు,హార్టికల్చర్, ప్లాంటేషన్, క్యాటిల్ షెడ్స్,గోట్ షెడ్స్, పౌల్ట్రీ ఫామ్స్, పంట పొలాలకు రోడ్డు పనులు తదితర పనుకు సద్వినియోగం  చేసుకోవాలని సూచించారు.మండలంలో వివిధ 99 రకాల పనులకు రూ.30.38 లక్షల మంజూరైనట్లుగా,తాడిచెర్లలో సామూహిక మరుగుదొడ్డి రూ.3 లక్షలతో ప్రారంభం చేసినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పాక్స్ చైర్మన్ ఇప్ప మొండయ్య,మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు,ప్యాక్స్ డైరెక్టర్ వొన్న తిరుపతి రావు,ప్రత్యేకధికారి విజయకుమార్,ఎంపీడీఓ శ్రీనివాస్,ఏపిఓ గిరి. హరీష్,గ్రామ కార్యదర్శి మల్లికార్జున్ రెడ్డి,పంచాయతీ సిబ్బంది,ఈజిఎస్ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad