మండల విద్యాశాఖ అధికారి సత్యనారాయణ రెడ్డి
నవతెలంగాణ – రాయపోల్
ప్రభుత్వం చేపట్టిన స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయుల పదోన్నతులలో రాయపోల్ మండలానికి ముగ్గురు గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కేటాయించబడ్డారని మండల విద్యాశాఖ అధికారి సత్యనారాయణ రెడ్డి తెలిపారు. శుక్రవారం మండలానికి కేటాయించబడిన గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా రిటైర్డ్ అయిన ప్రధానోపాధ్యాయుల స్థానలలో ఖాళీగా ఉన్న ప్రధానోపాధ్యాయుల ఉద్యోగాలను స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయుల పదోన్నతులతో భర్తీ చేశారు. దానిలో భాగంగానే రాయపోల్ మండలానికి ముగ్గురు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు పదోన్నతి పై వచ్చారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ముస్త్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి పదోన్నతి పై మీసా వెంకటేశ్వర్లు పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాయపోల్ ప్రధానోపాధ్యాయులుగా బదిలీపై వచ్చి బాధ్యతలు చేపట్టారు.
సిద్దిపేట జిల్లా ములుగు మండలం సింగన్నగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి పదోన్నతి పై బేగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా బదిలీపై వచ్చి ప్రమీల బాధితులు చేపట్టారు. అలాగే రాయపోల్ మండలం రాంసాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి పదోన్నతి పై వడ్డేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి పై గోవర్ధన్ బాధ్యతలు చేపట్టారు. నూతనంగా పదోన్నతి పొంది ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు చేపట్టిన ప్రధానోపాధ్యాయులకు ఆయా పాఠశాల ఉపాధ్యాయులు సన్మానం చేసి స్వాగతం పలికారు.
అలాగే రాయపోల్ పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు చేపట్టిన వెంకటేశ్వర్లు కు టిపిటిఎఫ్ రాయపోల్ మండల శాఖ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానం చేసి స్వాగతం పలకడం జరిగిందని టిపిటిఎఫ్ మండల అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి, కార్యదర్శి కనకయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు వెంకటేష్, శ్రీనివాస్, సుగుణాకర్ రెడ్డి , మెట్ రామ్, హరీష్, సావిత్రి, సుజాత, స్వాతి, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.
రాయపోల్ మండలానికి ముగ్గురు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES