పంచాయతీ కార్యదర్శి వి. గణేష్..
నవతెలంగాణ- రాయపోల్
పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన “పనుల జాతరలో” భాగంగా రాoసాగర్ గ్రామంలో పనుల జాతర కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని పంచాయతీ కార్యదర్శి వి. గణేష్ తెలిపారు. శుక్రవారం రాయపోల్ మండలం రాంసాగర్ గ్రామంలో మురికి కాలువలను శుభ్రం చేయడం జరిగింది చెట్లను ఇంటింటికి పంచి నాటించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మరియు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పనుల జాతర కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. దానిలో భాగంగానే గ్రామంలో ఇంటింటికి తిరిగి ఆరోగ్యం సర్వే ద్వారా జ్వర పీడితులను గుర్తించడం జరిగిందన్నారు.
వారిని రాయపాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపించి రక్త పరీక్షలు చేపించడం జరిగిందన్నారు. ఇంటింటికి తిరిగి పరిసరాల పరిశుభ్రత ,వ్యక్తిగత పరిశుభ్రత, డ్రైడే_ ఫ్రైడే యొక్క ప్రాముఖ్యతను వివరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులకు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పిహెచ్సి హెల్త్ అసిస్టెంట్ దేవసాని వాసుదేవ్, గ్రామ కారోబార్ రాగి హరికృష్ణ, ఆశా కార్యకర్తలు గిరిజ, సుకన్య , శానిటేషన్ సిబ్బంది సుజాత , నర్సమ్మ, నాంపల్లి, బిక్షపతి, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.