డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి.. గడ్డం వెంకటేష్
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
యాదాద్రి భువనగిరి జిల్లా నుండి గజ్వేల్, ప్రజ్ఞాపూర్, సిద్దిపేట వెళ్లే రోడ్డు గుంతల మయంగా మారి ప్రమాదాలకు కారణమవుతున్న పరిస్థితులలో కనీసం స్థానిక శాసనసభ్యులు, ఆర్ అండ్ బి అధికారులు పట్టించుకోవడంలేదని గుంతల మయమైన రోడ్డును వెంటనే మరమ్మత్తులు చేసి ప్రజల ఇబ్బందులు తొలగించాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్ డిమాండ్ చేశారు.
శుక్రవారం భువనగిరి నుండి హనుమాపురం మీదుగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ సిద్దిపేట వెళ్లే ప్రధాన రహదారి గుంతల మయంగా మారి వర్షం వస్తే రాత్రి సమయాల్లో గుంతలు కనిపించక అనేకమంది కిందపడి ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయని వారు అన్నారు. ఈ విషయంపై అనేకసార్లు అధికారుల దృష్టికి స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లిన స్పందన లేదు అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. హన్మాపురం మర్యాల చీకటిమామిడి గ్రామాల నుండి వందలాది మంది ప్రజలు విద్యార్థులు వ్యాపారస్తులు భువనగిరి జిల్లా కేంద్రానికి వస్తుంటారు వేల వాహనాలు, పెద్ద పెద్ద వాహనాలు ప్రయాణిస్తుంటాయి ఎప్పుడు ఎలా ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉందని, ఇట్టి విషయంపై అనేకమార్లు వినతిపత్రాలు, నిరసనలు చేసిన కనీసం స్పందన లేదు అని వారు అన్నారు. వెంటనే స్థానిక శాసనసభ సభ్యులు, ఆర్ అండ్ బి అధికారులు స్పందించి రోడ్డు మరమత్తులు చేయాలి అని వారు డిమాండ్ చేశారు. వీరితోపాటు డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు దయ్యాల మల్లేష్, ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా కార్యదర్శి వనం రాజు, వంశీ, చింటు లు పాల్గొన్నారు.