నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
పనుల జాతరలో భాగంగా గ్రామసభల నిర్వహణ, పనుల ప్రారంభోత్సవము, శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టినట్లు భువనగిరి ఎంపీడీవో సిహెచ్ శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం మండలంలోని వివిధ గ్రామాలలో గ్రామసభల్లో వ్యక్తిగత పనులు మంజూరైన లబ్ధిదారులకు మంజూరి ఉత్తర్వులు పంపిణీ చేయడం జరిగిందనారు. ఉపాధి హామీ పథకంలో ఎక్కువ పని దినాలు చేసిన దివ్యాంగుల కూలీలను సన్మాన కార్యక్రమం, గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం చేసినట్లు తెలిపారు. అన్ని గ్రామపంచాయతీలో మంజూరైన పశువుల పాకలు(24) గొర్రెల షెడ్లు(2), కోళ్ల ఫారం షెడ్లు, నడెపు కంపోస్ట్, వ్యక్తిగత ఇంకుడు గుంతలు(63), అంగన్వాడీ కేంద్రాలు(1) కమ్యూనిటీ ఇంకుడు గుంతలు మొదలైన పనులను అన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో, మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖా బాబు రావు ,మండల ప్రత్యేక అధికారి శ్యాంసుందర్, మండల పంచాయతీ అధికారి ఎం దినకర్, ఏపీవో బాలస్వామి, అన్ని గ్రామ పంచాయతీల ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్లు, క్షేత్ర సహాయకులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేపట్టిన ఎంపీడీవో..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES