– వినాయక చవితి ఉత్సవాలు నిర్వహణకు అని హెచ్ ఎం కు అభ్యర్ధన
– ఆట స్థలం పాఠశాల కే ఉంచాలని పట్టుబట్టిన దళిత యువకులు
– వారి అభ్యంతరం తో ఇరువర్గాలు మద్యం వాగ్వాదం
నవతెలంగాణ – అశ్వారావుపేట
మండలంలోని నారాయణపురం పంచాయితీ ఎస్సీ కాలనీ లో గల ఎంపీపీ ఎస్ కు కేటాయించిన ఆట స్థలంలో దళితేతరులు కొందరు వినాయకచవితి ఉత్సవాలు నిర్వహించు కుంటాం అని, అందుకోసం పరిసరాలను శుభ్రం చేస్తామని శుక్రవారం ప్రధానోపాధ్యాయులు లక్ష్మి కాంతం ను అభ్యర్థించారు. అనంతరం జేసీబీ తో ఆట స్థలాన్ని శుభ్రం చేయడం మొదలు పెట్టారు. ఇది గమనించిన దళిత యువకులు కొందరు ఆ స్థలం బడి పిల్లలకు ఆటస్థలం గా నే ఉండాలని,మరే ఇతర కార్యక్రమాలు పాఠశాల ప్రాంగణంలో నిర్వహించడానికి కుదరదని ఖరాఖండిగా చెప్పారు.
ఈ క్రమంలో బీసీ – ఎస్సీ యువకుల మధ్య మాటా మాటా పెరిగి తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది.ఇదే సమయంలో దళితేతరులు కొందరు దేవుడు కి బడి కి కాదు ఈ స్థలం బీసీ కమ్యూనిటీ హాల్ కు వినియోగిస్తామని నోరుజారారు. కులం పేరుతో దూషించారని అక్కడి దళిత యువకులు కొందరు నవతెలంగాణ కు సమాచారం ఇచ్చారు. ఇదే విషయం అయి హెచ్ ఎం లక్ష్మి కాంతం ను నవతెలంగాణ వివరణ కోరగా ఈ విధంగా సమాధానం ఇచ్చారు. గ్రామస్తులు కొందరు వచ్చి పాఠశాల ప్రాంగణంలోని ఖాలీ స్థలం వినాయక ఉత్సవం నిర్వహిస్తామని, గతంలోనూ నిర్వహించుకునే వారం అని అన్నారు.నేను పాఠశాలకు కొత్తగ రావడంతో పూర్వం ఇక్కడ పనిచేసిన హెచ్ఎం రోజా రాణి ని అడిగితే అది పాఠశాలకు చెందిన ఆటస్థలం మే నని వినాయక ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారని తెలిపారని ఆమె వివరించారు.
ఎన్నో ఏళ్ళుగా ఎస్సీ కాలనీలో ప్రాథమిక పాఠశాల ఉంది అని, ఆ పాఠశాల ఆట స్థలం కొరకు సుమారుగా రెండు ఎకరాల వరకు మెయిన్ రోడ్ ప్రక్కనే ఖాలీ స్థలం ఉండటంతో బీసీ వర్గీయులు పలువురు దాన్ని దేవుడి పేరుతో ఆక్రమించడానికి పన్నాగాలు పన్నుతున్నారని దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ బడిలో అధిక మొత్తంలో 95 శాతం ఎస్సీ ఎస్టీ పిల్లలు ఆ పాఠశాలలో చదువుతున్నారు అని,ఇందుకోసం ఆట స్థలం తో పాటు భవిష్యత్తు అవసరాల రీత్యా భవన సముదాయం నిర్మాణానికి స్థలం అవసరం ఉంటుందని దళిత యువకులు పట్టుబడుతున్నారు.మెయిన్ రోడ్ ప్రక్కనే ఉండటం వలన ఆ స్థలంపై కొందరి కళ్ళు పడ్డాయని,మేము బడి ప్రయోజనాల కోసమే ఈ ఆట స్థలానికి వినియోగించాలని కాలనీ వాసులు అందరూ ఒకే మాట పై ఉన్నారు.