No menu items!
Saturday, August 23, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeమానవినలుపు పోవాలంటే..

నలుపు పోవాలంటే..

- Advertisement -

అంతర్గత ఆరోగ్యం ఎంత ముఖ్యమో.. బాహ్య సంరక్షణ కూడా అంతే ముఖ్యం. పగటి పూట ముఖ్యంగా ఎండలో ఎక్కువగా తిరగడం వలన వచ్చే మచ్చలు. ముఖానికి మనం ఎంతగా కప్పుకున్నా, చేతులకు గ్లౌజు వేసుకున్నా ఎండకు ముఖం, చేతులు, కాళ్ళపై నల్లటి మచ్చలు ఏర్పడతాయి. మరి దీన్ని ఎలా చేయాలని కొందరు సతమతుంటారు. మీరు బ్యూటీ పార్లల్‌కు వెళ్లనవసరం లేకుండా ఇంట్లోనే ఈ చిట్కాలు ఉపయోగించవచ్చు. ఒక్కసారి మీరు ట్రైచేసి చూడండి.
ఎర్రగా పండిన టొమాటో తీసుకుని మెత్తగా పేస్ట్‌ చేయాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట తర్వాత మంచి నీళ్లతో కడిగేయాలి. టొమాటోలో యాంటీ ఆక్సిడెంట్స్‌ ఎక్కువగా ఉండటంతో పాటు సి-విటమిన్‌ ఉంటుంది. దీంతో ట్యానింగ్‌ సులువుగా పోతుంది. చర్మం మదువుగా తయారవుతుంది.
ముందుగా ఒక టేబుల్‌ స్పూన్‌ నిమ్మరసాన్ని బౌల్‌లో తీసుకుని దానికి ఒక టీస్పూన్‌ చక్కెర జత చేయాలి. ఆ మిశ్రమాన్ని స్క్రబ్బర్‌లా ముఖానికి పట్టించాలి. ఇలా చేయటం వల్ల ట్యానింగ్‌ మటుమాయం అవుతుంది. నిమ్మలో విటమిన్‌ -సి పుష్కలం కాబట్టి చర్మం మరింత మదువుగా తయారవుతుంది.
కాస్త బొప్పాయి పండు మెత్తని గుజ్జును తీసుకని, అందులోకి టేబుల్‌ స్పూన్‌ తేనే, మరో టేబుల్‌ స్పూన్‌ నిమ్మరసం కలపాలి. మెత్తగా పేస్టు చేయాలి. ఎండకు చర్మం నల్లబడిన ప్రాంతంలో పట్టిస్తే మెరుగైన ఫలితం ఉంటుంది. ఈ బొప్పాయి ఫేస్‌ ప్యాక్‌తో మొటిమల సమస్య దరిచేరదు.
బౌల్‌లో మూడు టేబుల్‌ స్పూన్ల అలొవెరా జెల్‌, రెండు టేబుల్‌ స్పూన్ల తేనె, టేబుల్‌ స్పూన్‌ పసుపు వేసి చూర్ణం చేయాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి పట్టించి ఆరిన తర్వాత కడిగేయాలి. ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad