ఎన్.బి.జె. ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత ఎన్ బిక్కునాథ్ నాయక్ నిర్మిస్తున్న సినిమా ‘త్రిశెంకినీ’. ఇందులో ప్రధాన పాత్రలో నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు రంజిత్ కుమార్. పలువురు నూతన నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శుక్రవారం చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ లాంచ్ ఈవెంట్ ప్రసాద్‌ల్యాబ్స్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నటుడు బాబుమోహన్ మాట్లాడుతూ, ‘మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఆయన మరిన్ని గొప్ప విజయాలు సాధించాలి. తన నటన, డ్యాన్సులతో మనల్ని మరింతగా అలరించాలని కోరుకుంటున్నా. మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్ లాంచ్ చేసుకోవడం సంతోషంగా ఉంది’ అని అన్నారు.
‘చిరంజీవి 70వ జన్మదినోత్సవం సందర్భంగా ఆయనకు మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నాకు సినిమాలంటే ప్యాషన్. నేను కష్ణ అభిమానిని. గతంలో పాటలు కూడా రాశాను. ఓ చిత్ర రూపకల్పనకు ప్లాన్ చేశాం. రంజిత్‌తో పరిచయం ఏర్పడింది. ఈ సినిమా గురించి చెప్పి నప్పుడు తప్పకుండా మనం ట్రావెల్ చేద్దామని చెప్పాను. అలా ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో ఓ సరికొత్త మూవీ చేశాం’ అని నిర్మాత ఎన్.బిక్కునాథ్ నాయక్ చెప్పారు.
నటుడు, దర్శకుడు రంజిత్ కుమార్ మాట్లాడుతూ,’నేను చిరంజీవి అభిమానిని. ఆయన బర్త్ డే సందర్భంగా మా సినిమా టైటిల్ లాంచ్ చేసుకోవడం అదష్టంగా భావిస్తున్నా. ఈ చిత్రంలో ‘జై జై మెగాస్టార్’ అనే పాటను రూపొందించాం. ఆ పాటను మెగా అభిమానులు ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. కాపీ రైట్ లేదు’ అని తెలిపారు.
సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్
- Advertisement -
- Advertisement -