బూటీఫుల్ లవ్ సాంగ్
హీరో నారా రోహిత్ నటించిన కొత్త చిత్రం ‘సుందరకాండ’.
నూతన దర్శకుడు వెంకటేష్ నిమ్మల పూడి దర్శకత్వం వహించారు. సందీప్ పిక్చర్ ప్యాలెస్ బ్యానర్‌పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు.
ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై స్ట్రాంగ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. శుక్రవారం మేకర్స్ ఈ సినిమా నుండి ‘డియర్ ఐరా..’ సాంగ్‌ని రిలీజ్ చేశారు. లియాన్ జేమ్స్ ఈ పాటని బ్యూటీఫుల్ లవ్ సాంగ్‌గా కంపోజ్ చేశారు.శ్రీ హర్ష ఈమని రాసిన లిరిక్స్ లీడ్ పెయిర్ ఎమోషన్‌ని అద్భుతంగా ప్రజెంట్ చేశాయి. లియోన్ జేమ్స్, కీర్తన వైద్యనాథన్ వోకల్స్ సాంగ్‌ని మరింత లవ్లీగా మార్చాయి. ఈ సాంగ్‌లో లీడ్ పెయిర్ కెమిస్ట్రీ చాలా ఫ్రెష్‌గా ఉంది. ఈ సాంగ్ ఇన్‌స్టంట్‌గా కనెక్టై, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రాన్ని ఈనెల 27న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది అని చిత్ర యూనిట్ తెలిపింది.
‘ఇందులో ఓ డిఫరెంట్ క్యారెక్టర్ చేశాను. నా క్యారెక్టర్ ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుంది. ఇటువంటి చిత్రంలో పార్ట్ అయినందుకే కాదు, ఇలాంటి మంచి సినిమాతో రీఎంట్రీ ఇవ్వడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఓ ఫ్రెష్ లవ్‌స్టోరీతో దర్శకుడు ఈ కథని చెప్పినప్పుడు చాలా థ్రిల్ అయ్యాను. ఇది సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ సినిమా. అందరూ తప్పకుండా థియేటర్లలో మా సినిమాని చూడండి. ఏమాత్రం మిమ్మల్ని డిజ్పాయింట్ చేయదు. నారారోహిత, వృతి వాఘాని పాత్రలు మిమ్మల్ని సర్‌ప్రైజ్ చేస్తాయి. ఇప్పటికే రిలీజైన పాటలు, టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది’ అని నాయిక శ్రీదేవి విజరుకుమార్ చెప్పారు.
నరేష్ విజయ కష్ణ, వాసుకి ఆనంద్, సత్య, అజరు, వీటీవీ గణేష్, అభినవ్ గోమటం, విశ్వంత్, రూప లక్ష్మి, సునైనా, రఘుబాబు తదితరులు నటించిన ఈచిత్రానికి డీఓపీ: ప్రదీప్. ఎం వర్మ, సంగీతం: లియోన్ జేమ్స్, ఎడిటర్: రోహన్ చిల్లాలే, ఆర్ట్ డైరెక్టర్: రాజేష్ పెంటకోట, సాహిత్యం: శ్రీ హర్ష ఈమని, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సందీప్, యాక్షన్ కొరియోగ్రఫీ: పథ్వీ మాస్టర్, డాన్స్ కొరియోగ్రఫీ: విశ్వ రఘు.
‘డియర్ ఐరా..’
- Advertisement -
- Advertisement -