– నిప్పుపెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు
– 40 క్వింటాళ్లు బూడిద పాలు
– కన్నీటి పర్యంతమైన రైతు కుటుంబం
నవతెలంగాణ-పెద్దకొత్తపల్లి
రాత్రనకా పగలనకా ఎండకు ఓర్చు, వానకు తడుస్తూ కష్టించి పండించిన 40 క్వింటాళ్ల ధాన్యం బూడిద కావడంతో ఆ రైతు కుటుంబం కన్నీటిపర్యంతమైంది. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్ల గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. వెన్నచర్ల గ్రామంలో వస్త్రాల మాసయ్య అనే రైతు తన వ్యవసాయం పొలంలో పండించిన వరి పంట చేతికి వచ్చింది. ఆ పంటను కోసి ఎండబెట్టి సంచుల్లో నింపి వ్యవసాయ పొలంలో ఉంచగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం సంచులకు నిప్పు అంటించారు. ఈ విషయం తెలుసుకున్న రైతు మాసయ్య, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అక్కడి నీటితో ఆర్పడానికి ప్రయత్నించినా లాభం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం విలువ లక్ష రూపాయల దాకా ఉంటుందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు రైతు ప్రభుత్వాన్ని కోరాడు.
వరి ధాన్యానికి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES