- Advertisement -
- మాజీ ఎమ్మెల్యే సుంకె, పార్టీ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు
నవతెలంగాణ -గంగాధర
ఎరువుల కొరతను తీర్చాలంటూ రైతులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రోడ్డెక్కారు. చాలీచాలని ఎరువుల సరఫరాతో రైతులు ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వం ఎరువుల కొరతను తీర్చాలంటూ గంగాధర మండలం మధురానగర్ చౌరస్తా కూడలిపై కొందరు రైతులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ధర్నాకు దిగారు. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆద్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎరువుల కొరతను తీర్చాలంటూ నినాదాలు చేయగానే, పోలీసులు ఆందోళనను అడ్డుకుని అరెస్టులు చేశారు. దీంతో రోడ్డుపైనే బైటాయించిన మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ను పోలీసులు బలవంతంగా పోలీస్ వాహనంలో ఎక్కించారు. పలువురు బీఆర్ఎస్ మాజీ సర్పంచులు, నాయకులను అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. అక్రమ అరెస్టులను నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే, నాయకులు పలు నినాదాలు చేశారు.
- Advertisement -