నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా బిబిపేట తహశీల్దార్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన ఎస్. గంగసాగర్ ను బిబిపేట మండల, ఆర్టిఐ మండల అధ్యక్షులు ఎం. నాంపల్లి, కార్యదర్శి పండ్ల హనుమంతు, తహశీల్దార్ కార్యాలయంలో శనివారం శాలువా పూలమాల వేసి స్వీటు తినిపించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ.. ఆర్ టి ఐ. బిబిపేట కమిటీ ఇలా సన్మానించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. మండల అధ్యక్షులు నాంపల్లి మాట్లాడుతూ.. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, అంకితభావంతో పనిచేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి పండ్ల హనుమంతు, సీనియర్ అసిస్టెంట్ వెంకటలక్ష్మి, జూనియర్ అసిస్టెంట్ చిరంజీవి, ఏ. రాణి. సిహెచ్.శ్రీలత, రికార్డు అసిస్టెంట్ రాజు, భాస్కర్, సిబ్బంది శ్రీకాంత్, అందే రాజయ్య, బాలరాజు, రాజయ్య, రామచంద్రం, లింగంలతోపాటు కమిటీ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
ఆర్టిఐ ఆధ్వర్యంలో బీబీపేట తహశీల్దార్ కు సన్మానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES