– మహబూబ్‌నగర్ జిల్లాలో ఘటన
నవతెలంగాణ – బాలానగర్
ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని చిన్నరేవిల్లిలో జరిగింది. చిన్నరేవెల్లి గ్రామానికి చెందిన ఎట్టి శివప్రసాద్ (17) అదే గ్రామానికి చెందిన హర్షిత (18) ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఆదివారం హర్షిత (చిన్నరేవెల్లి)లో ఆత్మహత్య చేసుకున్నది. అదే సమయంలో శివప్రసాద్ కూడా మోదంపల్లి శివారులోని రఘుమారెడ్డి పశువుల కొట్టంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, వీరు ఒకే కులానికి చెందినవారు. శివప్రసాద్ తండ్రి జంగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజాపూర్ ఎస్‌ఐ శివానంద్ కేసు నమోదు చేసుకొని దర్యాపు చేస్తున్నట్టు తెలిపారు. మృతదేహలను జడ్చర్ల ప్రభుత్వాస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
ప్రేమ జంట ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -