Saturday, August 23, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్సీపీఎస్ ను రద్దు చేయాలని తహశీల్దార్ కు వినతి

సీపీఎస్ ను రద్దు చేయాలని తహశీల్దార్ కు వినతి

- Advertisement -

నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండల తపస్ మండల అధ్యక్షులు ప్రవీణ్ కుమార్  నేతృత్వంలో స్థానిక మండల కేంద్రంలో సీపీఎస్ ఉపాధ్యాయుల సమావేశం ఏర్పాటు చేయబడింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ఉపాధ్యక్షులు  సత్యనారాయణ  ప్రసంగిస్తూ ఒక ప్రభుత్వ ఉద్యోగి ముప్పై నుండి నలభై సంవత్సరాలపాటు ప్రజాసేవలో గడిపిన అనంతరం జీవనాధారం కోసం కనీస పెన్షన్ కూడా లేకపోవడం అత్యంత  బాధాకరం అన్నారు. 2014 ఆగస్టు 23న తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయిన సమయంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేసే అవకాశం ఉన్నప్పటికీ చేయలేదని విమర్శించారు.

ప్రస్తుత ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేస్తామని హామీ ఇచ్చినా.. నేటివరకు స్పందించకపోవడం ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యాన్ని సూచిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆగస్టు 23 తేదీని ఉద్యోగులు, ఉపాధ్యాయులు చీకటి రోజుగా అభివర్ణించారు. తదనంతరం, గాంధారి తాసిల్దార్ రేణుక చాహాన్ కు తపస్ యూనియన్ పక్షాన సి.పి.యస్. రద్దు చేసి ఓపిఎస్ అమలు చేయాలని వినతిపత్రం సమర్పించారు. ఈ నిరసనలో పాల్గొన్న ఉపాధ్యాయులు అందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి  స్వామి, మహిళా కార్యదర్శి  భారతిరాణి,  వినాయక్ తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad