జిల్లా వ్యవసాయాధికారి పాల్వాయి శ్రవణ్
నవతెలంగాణ – పెద్దవూర
నానో యూరియాతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని రైతులకు క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలని జిల్లా వ్యవసాయాధికారి పాల్వాయి శ్రవణ్ అన్నారు. శనివారం మండలంలోని పలు పర్టిలైజర్స షాపులను పరిశీలించి అక్కడికి వచ్చిన రైతుల కు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ.. నానో యూరియా వాడకం వల్ల దిగుబడిలో అద్భుత ప్రయోజనాలు ఉన్నాయని, అత్యంత ప్రయోజన కారిణిగా ఉన్న నానో యూరియాని రైతులు వాడే విధంగా చూడాలన్నారు. నానో యూరియా అనేది నానో టెక్నాలజీ సహాయంతో తయారు చేయబడిన ద్రవ రూపంలో ఉండే ఎరువు దీనిని వాడకం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. నానో యూరియా మొక్కలకు సమర్థవంతంగా నత్రజనిని అందిస్తుందని, పంట దిగుబడిని పెంచడంలో సహాయపడుతుందన్నారు.
సాంప్రదాయ యూరియా వాడటం వల్ల పర్యవరణ కాలుష్యం, భూగర్భ జల వనరులకు ఇబ్బంది కలగడమే కాకుండా, నేలకు కూడా చాలా నష్టం కలుగుతుందన్నారు. సాంప్రదాయ యూరియాతో పోలిస్తే నానోయూరియా తక్కువ మొత్తంలో వాడడం వల్ల నీటి కాలుష్యాన్ని తగ్గిస్తుందన్నారు. మెరుగైన పోషక విలువలతో కూడిన పంటలను పండించడానికి నానో యూరియా సహాయపడుతుందన్నారు. క్షేత్ర స్థాయిలో రైతుల తో సమావేశం ఏర్పరచి నానో యూరియా వాడకం పైన విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. మండల వ్యవసాయాధికారి సందీప్ రెడ్డికి తెలిపారు. పంట ఆరోగ్యం, నాణ్యమైన ఉత్పత్తికి పచ్చిరొట్ట, సేంద్రియ, జీవన ఎరువులు ఎలా ఉపయోగపడతాయో నానో యూరియా కూడా అంతే అనే విషయాన్నీ అధికారులు రైతులకు వివరించాలన్నారు.
నానో యూరియాపై అవగాహన కల్పించాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES