Saturday, August 23, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్అనుకూల తీర్పు కోసం ఆలయంలో పూజలు..

అనుకూల తీర్పు కోసం ఆలయంలో పూజలు..

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచర్లలోని ఓసిపికి 500 మీటర్ల డేంజర్ జోన్లో నివసిస్తున్న భూనిర్వాసితులను  సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఇటీవల హైకోర్టులో వేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నెల 25న తీర్పు ఉన్నందున భూ నిర్వాసితులకు అనుకూలంగా రావాలని నిర్వాసితులు శనివారం తాడిచెర్ల వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెవిన్యూ శాఖ అధికారులు కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. కానీ కౌంటర్ దాఖలు చేయాల్సిన జెన్కో సంస్థ రెండు నెలలుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తాడిచెర్ల, కాపురం గ్రామాల భూ నిర్వాసితుల హాక్కుల సాధన పోరాట సమితి అధ్యక్షుడు కేశారపు రవి పేర్కొన్నారు.

ఈనెల 25న హైకోర్టులో కేసు విచారణ ఉన్నందున,జెన్కో సంస్థ భూనిర్వాసితులకు  అనుకూలంగా కౌంటర్ దాఖలు చేయాలని , భూ నిర్వాసితులకు అనుకూలంగా తీర్పు వెలుపడాలని ఆశిస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో భూ నిర్వాసితులు ఇందారపు చంద్రయ్య, రావుల రాజనర్సు, జంజర్ల సారయ్య, ఇందారపు సరీన్, ఇందారపు అనూష, ఇందారపు ప్రవీణ్, ఇందారపు సమ్మయ్య, ముడుతనపల్లి నారాయణ, కన్నూరి శివ, మారుపాక రాకేష్, ఇందారపు బృందం, బూడిద యశోద, బూడిద రాజసమ్మయ్య, ఇందారపు రామస్వామి, కొఠాగిరి శివ పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad