– గౌడులకు రిజర్వేషన్ వల్ల గీత కార్మికులకు ప్రయోజనమేమీ లేదు కల్లుగీత సొసైటీలకే ఇవ్వాలి
– కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు సైదగౌని వెంకట్ గౌడ్
నవతెలంగాణ – కామారెడ్డి
గీత కార్మికుల ఉపాధిని దెబ్బతీసే విధంగా నూతన మద్యం పాలసీని తీసుకురావడం సరైనది కాదని కల్లు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వెంకట్ గౌడ్ అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ .. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మద్యం పాలసీ లిక్కర్ కంపెనీలకు, బడా వ్యాపారులకు లాభం చేకూర్చి లక్షలాది మంది ఆధారపడి జీవిస్తున్న కల్లుగీత వృత్తిని దెబ్బతీస్తుంది అన్నారు. 15 శాతం గౌడ్ లకు రిజర్వేషన్ వల్ల కొంతమంది గౌడు లకు ఉపయోగపడుతుంది తప్ప కల్లుగీత వృత్తి చేసే వాళ్లకి ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు.
మద్యం వల్ల గీత కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని, కల్లుగీత కార్మిక సంఘం, గౌడ సంఘాలు ఆందోళన చేయగా గత బిఆర్ఎస్ ప్రభుత్వం గౌడులకు 15 శాతం రిజర్వేషన్స్ ఇచ్చిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో గతంలో కంటే ఎక్కువ 25 శాతం ఇస్తామని చెప్పి ఎప్పటిలాగానే 15 శాతం ఇచ్చారన్నారు. అది కూడా గతంలో వలె గౌడులకె ఇస్తామంటున్నారు. ఏ ప్రయోజనం కోసం రిజర్వేషన్స్ ఇచ్చారో అది నెరవేరదు అన్నారు. అందుకని ప్రభుత్వం పునరాలోచించి ఇచ్చిన హామీ ప్రకారము 25 శాతం ఇవ్వాలన్నారు. అది కల్లుగీత సొసైటీలకే ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
ఈత చేట్లు పెంచడానికి ప్రతి గ్రామానికి 10 ఎకరాల భూమిని ఇవ్వాలని కల్లు కు మార్కెట్ సౌకర్యం కల్పించాలని దీనితో లక్షలాది మంది కి జీవనోపాధి కల్పించవచ్చు అని కల్లు గీత వృత్తి రక్షణకై చట్టాలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అద్యక్షులు వెంకట్ గౌడ్ తోపాటు జిల్లా ఉపాధ్యక్షులు శేర్ల సాయాగౌడ్, రవీందర్ గౌడ్, సహాయ కార్యదర్శి రాజా గౌడ్, రమేష్ గౌడ్, బాలరాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
గీత కార్మికుల ఉపాధిని దెబ్బతీసేలా నూతన మద్యం పాలసీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES