గంటల తరబడి పాస్ బుక్ క్యూలో పెట్టి క్యూలో నిలబడిన రైతులు
పోలీసుల పహారులో యూరియా పంపిణీ
రైతులకు సరిపడి యూరియాను అందించాలని రైతుల ఆందోళన
నవతెలంగాణ – మిరుదొడ్డి
రాష్ట్రంలో మద్యం సరఫరా చేయడంలో ఉన్న ధ్యాస యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వానికి లేకుండా పోయిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా కోసం పాస్ బుక్ లతో రైతులు క్యూ లైన్ లో గంటలు తరబడి నిలబడిన యూరియా దొరకని పరిస్థితి ఉందన్నారు. రైతులు ఖాళీ మద్యం సీసా పాస్ బుక్ ల పై పెట్టి నిరసన వ్యక్తం చేశారు. యూరియా దొరకని రైతులు అధికారులను రైతు వేదికలో బంధించారు. దీంతో రైతు వేదిక వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామ రైతు వేదిక వద్ద యూరియా వచ్చిందని తెలవడంతో, ఉదయం నాలుగు గంటల నుండి రైతులు పాసుబుక్కులు లైన్లో పెట్టి క్యూ కట్టారు. కొంతమంది రైతులు ఖాళీ మద్యం సీసాలు పాస్బుక్ లపై పెట్టి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ప్రతి గ్రామంలో మద్యం ఏరులై పారుతుందని, రైతులు పండించే పంటకు యూరియా కావాలంటే మాత్రం దొరకడం లేదన్నారు.
యూరియా దొరకని రైతులు వ్యవసాయ అధికారులను రైతు వేదికలో బంధించి ఆందోళన చేశారు. రైతు వేదిక వద్ద ఒక్కసారిగా ఉధృత పరిస్థితులు నేలకొండలతో పోలీసులు రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. అనంతరం రైతులు మాట్లాడుతూ ,ఎంపీ రఘునందన్ రావు యూరియా కొరత లేదని కల్లబొల్లి కథలు చెప్పి, రైతులను మోసం చేయడం సరైనది కాదని విమర్శించారు. రైతులు యూరియా కోసం గంటల తరబడి యూరియా దొరకక వెను తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రైతులకు సరిపడా యూరియా అందజేయాలని డిమాండ్ చేశారు. యూరియా సరఫరాలో ఇబ్బందులు కలవకుండా ఉండేందుకు ఎస్ఐ సమత ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక్కసారిగా రైతులు యూరియా కోసం తోసుకు రావడంతో పోలీసులకు రైతులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ప్రభుత్వానికి మద్యం సరఫరా చేయడంలో ఉన్నంత ధ్యాస యూరియా సరఫరా చేయడంలో లేదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES