నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో శనివారం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ పిలుపుకు అనుగుణంగా ఉపాధ్యాయులు పెన్షన్ విద్రోహ దినం నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. రాష్ట్రంలో సిపిఎస్ జీవో వచ్చిన సెప్టెంబర్ 23 బ్లాక్ డే గా పాటిస్తూ కమ్మర్ పల్లి మండల శాఖ ఆధ్వర్యంలో అన్ని పాఠశాలల్లో భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీల ప్రదర్శన నిర్వహించారు.ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు కిషన్ మాట్లాడుతూ జీవో 28ని రద్దుచేసి రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని చేశారు.
ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం కొత్త పెన్షన్ విధానాన్ని అంతం చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, ఇచ్చిన హామీల ప్రకారం ఉద్యోగులందరికీ పిఆర్సి పెండింగ్ బిల్లులు, ఐదు డిఏల ను వెంటనే ప్రకటించాలని కమ్మర్ పల్లి తపస్ శాఖ పక్షాన డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఆయా పాఠశాలల్లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం డివిజన్ కార్యదర్శి శంకర్, రవి, ప్రధాన కార్యదర్శి రమేష్, తపస్ మహిళ అధ్యక్షురాలు స్వర్ణలత, పీజీహెచ్ఎం సాయన్న, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
పాఠశాలల్లో పెన్షన్ విద్రోహ దినం నిరసనలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES