Saturday, August 23, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుకాంగ్రెస్ పాలనలో విద్యా రంగం కుదేలు

కాంగ్రెస్ పాలనలో విద్యా రంగం కుదేలు

- Advertisement -

పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ ఫీజు దీక్ష
నవతెలంగాణ – కంఠేశ్వర్ 

భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ ఎఫ్ ఐ) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా స్థానిక ధర్నా చౌక్ వద్ద ఈ జిల్లాకు సంబంధించిన గత మూడు సంవత్సరాలు గా బకాయి పడ్డ ఫీజు రియంబర్స్మెంట్లనూ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు దీక్షకి ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షురాలు దీపిక అధ్యక్షతనగా వ్యవహరించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, ఎస్ ఎఫ్ ఐ  మాజీ రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వర్, ఐద్వా జిల్లా కార్యదర్శి బి. సుజాత  ఈ దీక్షను ప్రారంభించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ ఎఫ్ ఐ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి రాచకొండ విఘ్నేష్ మాట్లాడుతూ..ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ లను విడుదల కాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని, వారికి ఆత్మహత్యలు శరణ్యమా అన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరించడం బాధాకరమని అవేదన వ్యక్తం చేశారు.

దాంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఫీజు బకాయిలను విడుదల చేస్తాం అని హామీ ఇచ్చిన ఇప్పటివరకు పట్టించుకోకపోవడం దారుణం అని అన్నారు. ఈ రాష్ట్రంలో లిక్కర్ కి మంత్రి ఉండొచ్చుగానీ సమాజాన్ని మార్చే విద్యా వ్యవస్థకు మాత్రం మంత్రి లేకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. అదేవిధంగా పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ కాస్మొటిక్ ఛార్జీలను 3000 వేలకు పెంచాలని అన్నారు. అదే విధంగా సంక్షేమ హాస్టల్లో మౌళిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమవుతుందని అన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోతే ఈ నెల 30 తేదీన విద్యార్థి లోకం తో జిల్లా కలెక్టరేట్ ను ముట్టడి చేస్తాం అని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షురాలు దీపిక, ఎస్ ఎఫ్ ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు రాజు కుమార్, నగర అధ్యక్ష కార్యదర్శులు అజాద్, చక్రి , నవీపేట్ మండల కార్యదర్శి గోవింద్, నగర నాయకులు నాయకులు గణేష్, సతీష్, తదితర నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad