Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeబీజినెస్'అన్‌లీష్ ది పవర్ వితిన్' ప్రచారోద్యమంతో షెల్ హెలిక్స్ ఒక కొత్త శకానికి నాంది

‘అన్‌లీష్ ది పవర్ వితిన్’ ప్రచారోద్యమంతో షెల్ హెలిక్స్ ఒక కొత్త శకానికి నాంది

- Advertisement -

నవతెలంగాణ – న్యూఢిల్లీ: షెల్ ఇండియా, ఇప్పుడు అధునాతనమైన 2025 API SQ ప్రమాణాన్ని నెరవేర్చేలా రూపొందించబడి, ఉన్నతీకరించబడిన తన ప్రీమియం మోటార్ ఆయిల్, షెల్ హెలిక్స్ అల్ట్రాను ఆవిష్కరించింది.   ఈ ఆవిష్కరణ, బ్రాండ్ యొక్క కొనసాగుతున్న పరిణామాన్ని మరియు నవ్యత ఇంకా శ్రేష్ఠత పట్ల అంతులేని నిబద్ధతను ప్రతిబింబించే తాజా రూపాన్ని ప్రదర్శిస్తూ తన చిహ్నాత్మకమైన షెల్ హెలిక్స్ లూబ్రికెంట్ శ్రేణి కోసం ఘనమైన కొత్త ప్యాకేజింగ్ రూపకల్పనను కూడా విడుదల చేసింది.

అంతిమమైన పనితీరు మరియు రక్షణను అందించడానికి గాను రూపొందించబడిన కొత్త షెల్ హెలిక్స్ అల్ట్రా అనేది ఇంజిన్లు సుదీర్ఘ కాలం శక్తివంతంగా మరియు స్పందనాత్మకంగా ఉండటానికి సహాయపడుతుంది1. ఈ నవీన ఆవిష్కరణ కేంద్రితంగా ఉన్న షెల్ యొక్క ప్రత్యేకమైన ప్యూర్‌ప్లస్ టెక్నాలజీ, సహజ వాయువును 99.5% స్వచ్ఛమైన ప్రాథమ్య చమురుగా పరివర్తన చేస్తుంది2. ఫలితము: 1.8% వరకు మరింత ఇంజిన్ పవర్3, 3.4% మెరుగైన ప్రతిస్పందన3, మరియు 100% ఇంజిన్ పవర్ నిలుపుదల3 అనేవి సున్నితమైన డ్రైవ్, మెరుగైన ఇంధన చౌకదనం మరియు దీర్ఘకాలిక ఇంజిన్ ఆరోగ్యంగా తర్జుమా అవుతాయి.

షెల్ ఇండియా ల్యూబ్రికెంట్స్ ఛీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ శ్రీ అమిత్ ఘూగ్రే గారు మాట్లాడుతూ ఇలా అన్నారు, ఈ ఆవిష్కరణ భారతదేశంలో షెల్ లూబ్రికెంట్ల కోసం ఒక అనిర్వచనీయమైన క్షణాన్ని సూచిస్తుంది. షెల్ హెలిక్స్ అల్ట్రా ఇప్పుడు అధునాతనమైన 2025 API SQ ప్రమాణాన్ని నెరవేర్చడంతో మరియు మా ఘనమైన కొత్త ప్యాకేజింగ్ డిజైన్ అందుబాటు లోనికి రావడంతో, మేము నవ్యతా ఆవిష్కరణ మరియు కస్టమర్ కేంద్రీకృతం పట్ల మా నిబద్ధతను ప్రతిబింబించే రెండు ప్రధాన ఘట్టాల సంబరాలను జరుపుకుంటున్నాము. ఈ కొత్త అధ్యాయం గురించి మేము ఎంతో ఉత్సాహంగా ఉన్నాము ఎందుకంటే ఈ రోజు మేము మరింత శక్తివంతమైన ఉత్పాదనను విడుదల చేయడం మాత్రమే కాదు; మేము భాగస్వామ్యాలు, పనితీరు మరియు పురోగతి సంబరాలను జరుపుకుంటున్నాము” అన్నారు.

ఈ కొత్త షెల్ హెలిక్స్ ప్యాకేజింగ్ ఘనమైన రూపకల్పన మరియు పెంపొందించబడిన పనితనాన్ని మిళితం చేసే ‘మరింత శక్తివంతమైన ఎంపిక’ ను అందించడానికై రూపొందించబడింది. సొగసైన, ఆధునికమైన మరియు పనితీరు-ఆధారితమైన, తాజాదనపు చూపు షెల్ఫ్- పై ప్రభావపు మెరుగుదలను, ఉత్పాదన ముందుకు వెళ్ళడాన్ని సరళీకృతం చేస్తూ వినియోగదారులకు గొప్ప సౌలభ్యాన్ని అందించడమే లక్ష్యంగా చేసుకుంది. ఈ డిజైన్, ఉత్తమమైన నాణ్యత మరియు పనితీరును అందించడంలో బ్రాండ్ యొక్క విశ్వసనీయ పాత్రను నొక్కి వక్కాణిస్తూ, మారుతి సుజుకి, హ్యుండాయ్ మోటార్స్, నిస్సాన్ మోటార్ కార్పొరేషన్, BMW-ఎం మోటార్‌స్పోర్ట్స్ వంటి అగ్రశ్రేణి ఆటోమోటివ్ తయారీదారులతో సహా ప్రముఖ OEMలతో షెల్ హెలిక్స్ యొక్క ధృఢమైన అనుబంధాన్ని నొక్కి చెబుతుంది.

ఈ ఆవిష్కరణ భారతదేశంలో షెల్ యొక్క కొత్త ప్రపంచ ప్రచారోద్యమం ‘అన్‌లీష్ ది పవర్ వితిన్’ ప్రారంభోత్సవంతో చోటు చేసుకుంటుంది, ఇందులో మొదటిసారిగా ప్రపంచ ప్రఖ్యాత స్కుడెరియా ఫెరారీ HP డ్రైవర్స్ చార్లెస్ లెక్లెర్క్ మరియు లూయిస్ హామిల్టన్ నటిస్తున్నారు. ఇది స్కుడెరియా ఫెరారీ HPతో షెల్ యొక్క 75 సంవత్సరాల చిహ్నాత్మకమైన భాగస్వామ్యంలో అత్యంత తాజా అధ్యాయాన్ని సూచిస్తుంది. ‘అన్‌లీష్ ది పవర్ వితిన్’ ప్రచారోద్యమ చిత్రాన్ని ఇక్కడ చూడండి – https://www.instagram.com/reel/DKR_3b6guo4/?igsh=MTVxbnBpa3gwMzdjcA==

భారతదేశంలో జరిగిన ప్రారంభ వేడుక కీలకమైన అగ్రగణ్యులు, ఆటోమోటివ్ ఔత్సాహికులు మరియు కస్టమర్లను ఒకచోట చేర్చి రెండు-రోజుల పాటు ఉత్తేజకరమైన అనుభవాన్ని అందించింది. హాజరైన వారు అభిమానుల ప్రదేశంలో పరస్పర ఆటలను ఆనందించారు మరియు ప్రత్యక్షంగా ఫెరారీ పిట్ స్టాప్ ప్రదర్శన యొక్క కచ్చితత్వాన్ని స్వయంగా వీక్షించారు మరియు ప్రత్యేకమైన BMW-ఎం మోటార్‌స్పోర్ట్స్ డ్రైవింగ్ అనుభవాన్ని చవి చూస్తూ షెల్ హెలిక్స్ యొక్క సరికొత్త శకం చుట్టూ ఉన్న ఉత్సాహాన్ని మరింతగా పెంచారు.

వరుసగా 18 సంవత్సరాల పాటు, షెల్ ప్రపంచంలోనే నంబర్ 1 లూబ్రికెంట్ సరఫరాదారుగా ఉంటోంది, ఇది తన నిరంతర ఆవిష్కరణ మరియు సర్వోన్నతమైన నాణ్యతకు నిదర్శనంగా ఉంది. ఉన్నతీకరించబడిన ఈ షెల్ హెలిక్స్ శ్రేణి సరిసాటి లేని ఇంజిన్ రక్షణ మరియు పనితీరును అందజేస్తూ ఈ వారసత్వాన్ని కొనసాగిస్తోంది. షెల్ ఇండియా ఈ సరికొత్త అధ్యాయం లోనికి అడుగుపెడుతూ ఉండగా, మార్గాన్వేషణ మరియు అందుకు అతీతంగా ప్రతి ప్రయాణానికి శక్తిని అందించడానికి తన నిబద్ధతను పునరుద్ఘాటిస్తోంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad