సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దాసరి పాండు
నవతెలంగాణ – బొమ్మలరామారం
రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో నెలకొన్న స్థానిక సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా ఉన్నదని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దాసరి పాండు అన్నారు. పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని గ్రామపంచాయతీ కార్యదర్శి వినతి పత్రం అందజేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా స్థానికంగా ఉన్న సమస్యలు మంచినీటి సమస్య, డ్రైనేజీ, సిసి రోడ్లు, వీధిలైట్లు, లింక్ రోడ్లు, సమస్యలతోపాటు ఇండ్లు ఇండ్ల స్థలాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, అర్హులైన పేదలందరికీ ఇవ్వడం లేదని, కొంతమందికే ఇచ్చి అందరికీ ఇస్తున్నామని చెప్పుకోవడం సరైన పద్ధతి కాదని అన్నారు. అర్హులైన పేదలు వందలాదిగా ఇండ్లు ఇండ్ల స్థలం లేక అవస్థలు పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ర్యకలశ్రీశైలం, నాయకులు దేశెట్టి సత్యనారాయణ, పున్నమ్మ మేకల, మంగ, రమేష్ ,నరేష్, తదితరులు పాల్గొన్నారు.
స్థానిక సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES