No menu items!
Sunday, August 24, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeతెలంగాణ రౌండప్పత్తి రైతులకు కేంద్ర ప్రభుత్వం మరణ శాసనం రాస్తోంది..

పత్తి రైతులకు కేంద్ర ప్రభుత్వం మరణ శాసనం రాస్తోంది..

- Advertisement -

పత్తి దిగుమతుల సుంకాన్ని తొలగించాలనే నోటిఫికేషన్ వెంటనే ఉపసంహరించుకోవాలి..
పత్తి రైతులు కేంద్రం తీసుకువచ్చిన ఆ నోటిఫికేషన్ రద్దు చేయాలని మోడీకి తీర్మానాలు పంపించాలి..
రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బండ శ్రీశైలం..
నవతెలంగాణ – మునుగోడు

పత్తి దిగుమతులపై 11 శాతం సుంకాన్ని రద్దు చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతులకు మరణ శాసనం రాస్తోందని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బండ శ్రీశైలం ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం మండల కేంద్రంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ .. కేంద్రం తీసుకువచ్చిన ఆ నోటిఫికేషన్ రద్దు చేయాలని కోరుతూ గ్రామాలలో పత్తి రైతులు తీర్మానాలు చేసి ప్రధానమంత్రి మోడీకి పంపించాలని పిలుపునిచ్చారు.

కేంద్రం తీసుకున్న నిర్ణయంతో దేశీయ పత్తి ధర పై తీవ్రంగా ప్రభావం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి ధర తగ్గడంతో పెట్టిన పెట్టుబడులు రాకపోవడం వల్ల రైతులు మరిన్ని కష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉందని తెలిపారు. పత్తి దిగుమతుల సుంకాన్ని తొలగించాలనే నోటిఫికేషన్ వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పత్తి క్వింటల్ కు 10,075 చొప్పున మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సాగర్ల మల్లేష్, మండలం కమిటీ సభ్యులు వరికుప్పల ముత్యాలు, యాస రాణి శ్రీను, యాట యాదయ్య, కాల్వలపల్లి గ్రామ కార్యదర్శి వంటెపాక అయోధ్య తదితరులు ఉన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad