No menu items!
Sunday, August 24, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeతెలంగాణ రౌండప్అర్హులందరికీ ఇండ్లు, పెన్షన్లు వెంటనే అందించాలి..

అర్హులందరికీ ఇండ్లు, పెన్షన్లు వెంటనే అందించాలి..

- Advertisement -

దళితులకు స్మశాన వాటికకు ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలి
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నర్సిములు డిమాండ్
నవతెలంగాణ – కంది 

సీపీఐ(ఎం) కంది మండల కమిటీ ఆధ్వర్యంలో శనివారం వివిధ గ్రామాలను పల్లెబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.నర్సిములు మాట్లాడుతూ.. మండల పరిధిలో గల ఎద్దు మైలారం, చర్లగూడెం, కంది తదితర గ్రామాలలో అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతుండడంతో నిధులు రావడం లేదని ప్రజా సమస్యలు గాలికొదిలేసారని అన్నారు. చర్లగూడెం గ్రామం కాశవాడ లో వర్షాలకు సుమారుగా 15 ఇండ్లు కూలిపోయాయని, అనేకమంది ప్లాస్టిక్ కవర్లతో నిర్మించినటువంటి ఇండ్లలో నివాసం ఉంటున్నారని, అధికారులు ఫోటోలు తీసుకొని వెళ్లి ప్రభుత్వం తరఫున రావాల్సిన సహకారాన్ని అందించలేరని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మంచినీటి సమస్యతో  ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అధికారులు పట్టించుకోవడంలేదని అన్నారు.  ఎద్దు మైలారం గ్రామంలో దళితులకు స్మశాన వాటిక లేకపోవడంతో వాగులో శవాలను పూడ్చడం వలన వర్షాలు కురిసినప్పుడు పై మట్టి మొత్తం కొట్టుకొని పోతుందని, వెంటనే స్మశాన వాటికకు ప్రభుత్వం స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు.

మండల కేంద్రంలోనీ లక్ష్మీ నగర్ కాలనీలో ప్రభుత్వం ఇచ్చిన ఇండ్ల స్థలాలను కొంతమంది ఆక్రమించి అమ్ముకొని లాభాలు గడించే పరిస్థితి నెలకొందని, అక్రమార్కులపై ప్రభుత్వం చర్యలు తీసుకుని పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని అన్నారు. ఎన్నికల ముందు ప్రభుత్వమిచ్చిన హామీలో భాగంగా మహిళలకు రూ.2500, ఉపాధి కూలీలకు సంవత్సరానికి రూ.12,000 రావడంలేదని, అనేకమంది పెన్షన్లకు దరఖాస్తు చేసుకొని 3 సంవత్సరాలైనా ఎందుకు పెన్షన్ ఇవ్వడం లేదని అన్నారు.

ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనేక సమస్యలతో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారని ప్రభుత్వ అధికారులు పర్యటనలు నిర్వహించి ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరించాలని అన్నారు. లేనియెడల ప్రజానీకాన్ని కూడగట్టి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాజ మల్లయ్య, మల్లయ్య, సాయిలు, సాయి, రాజు, ఆనంద్, సుజాత, షబానా, రాములు, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad