నవతెలంగాణ – కామారెడ్డి
శనిశ్వేరునికి శ్రేష్టమైన పోలాల అమావాస్య, శనివారం 40 ఏళ్లలో కలిసి రావడం విశేషమని వేదపండితులు జి. అంజనేయశర్మ అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శని శింగనపురం శ్రీశనేశ్వరునికి తెల్లవారు జామున 21 కిలోల నువ్వుల నూనెతో అభిషేకం, హోమం నిర్వహించారు. శని బాధలు తొలిగించుకోవాలనే నమ్మకంతో వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి శసేశ్వరునికి 19 ప్రదక్షణలు చేసి తైలాభిషేకం చేశారు. ఆలయ కమిటీ నుంచి భక్తులకు ఉచితంగా తైలం సమకూర్చారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు లింగాగౌడ్, రవీందర్ రెడ్డి , యాద అనిల్ కుమార్, దేవాచారి, పాత ధర్మరాజు, అర్చకులు ఫణిశర్మ, అరివింద్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
శ్రీశనేశ్వరునికి పోలాల అమావాస్య పూజలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES