- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : గణపతి నవరాత్రులు దగ్గర పడుతున్న నేపథ్యంలో భక్తులు మండపాల ఏర్పాటులో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో నిర్వాహకులకు తెలంగాణ పోలీసులు సూచనలు జారీ చేశారు. నిర్వాహకులు అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అపరిచిత వ్యక్తుల కదలికలు గుర్తిస్తే తక్షణమే సమాచారం ఇవ్వాలని, స్థానిక వ్యక్తులను వాలంటీర్లుగా నియమించుకోవాలని, భక్తుల కోసం పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
- Advertisement -