No menu items!
Sunday, August 24, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeఖమ్మంఅతిథి అధ్యాపకుల దరఖాస్తులకు ఆహ్వానం: ప్రిన్సిపాల్ డా. ఎన్.గోపి

అతిథి అధ్యాపకుల దరఖాస్తులకు ఆహ్వానం: ప్రిన్సిపాల్ డా. ఎన్.గోపి

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన నియామకాలు చేసేందుకుగాను అతిథి అధ్యాపకుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.గోపి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర కళాశాల కమిషనర్ ఆదేశాలు మేరకు 2025 – 26 విద్యా సంవత్సరం కు గాను ఖాళీగా ఉన్న తెలుగు,ఇంగ్లీష్, ఎకనామిక్స్, హిస్టరీ విభాగాలలో ఒక్కో అతిథి అధ్యాపకుల నియామకం ఈ నెల 29 వ తేదీ శుక్రవారం  ఉదయం 10 గంటల నుంచి శ్రీ రామచంద్ర ఆర్ట్స్ అండ్ సైన్స్ ప్రభుత్వ కళాశాల కొత్తగూడెం ప్రాంగణంలో ఇంటర్వ్యూ ద్వారా నిర్వహించబడతాయి అని తెలియజేశారు.

అభ్యర్ధులు సంబంధిత సబ్జెక్టులో 55 శాతం మార్కులు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 50% మార్కులు ఉండాలని అన్నారు.నెట్/సెట్/పీహెచ్డీ కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వ బడుతుంది అని అన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 25,26,28 తేదీలలో సాయంత్రం నాలుగు గంటల లోపు తమ పూర్తి బయోడేటా తో పాటు జత చేసిన సర్టిఫికెట్స్ అప్లికేషన్ ను జే వి ఆర్ ప్రభుత్వ కళాశాల సత్తుపల్లి నందు సమర్పించ గలరని తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad