Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుTeachers:ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను పరిష్కరించాలి 

Teachers:ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను పరిష్కరించాలి 

- Advertisement -

యూఎస్పిసి ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో పాల్గొన్న పాలకుర్తి ఉపాధ్యాయ సంఘాల నాయకులు 

నవతెలంగాణ-పాలకుర్తి

కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల సందర్భంగా ఎన్నికల మెనీ ఫెస్టోలో ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను వెంటనే పరిష్కరించాలని యూఎస్పిసి మండల నాయకులు వీరమల్ల బాబయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యా రంగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం హైదరాబాదు ఇందిరా పార్కు వద్ద యు.ఎస్.పి.సి ఆధ్వర్యంలో నిర్వహించిన మహా ధర్నా కార్యక్రమానికి మండలంలోని ఉపాధ్యాయ సంఘాల నాయకులు తరలివెల్లి ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇమ్మడి అశోక్, ఎండి షరీఫ్, చిదురాల శ్రీనివాస్ లు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడుస్తున్నప్పటికీ విద్యారంగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తుందని తెలిపారు. ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ డీఏలను, పెండింగ్ పిఆర్సీలను, పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేసి ఉపాధ్యాయులకు అందించాలని డిమాండ్ చేశారు. మహాధర్నా కార్యక్రమంలో చిదురాల రమేష్, డి వెంకటేశ్వర్లు, దేవగిరి సూర్యప్రకాష్, తోట వెంకట్, నీలకంఠం, నేతి కొండయ్య, శౌరీలు, ఆర్ సరస్వతి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad