Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్నానో యూరియాతో అధిక లాభాలు: డా.బైరి రమేష్ గౌడ్ 

నానో యూరియాతో అధిక లాభాలు: డా.బైరి రమేష్ గౌడ్ 

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు రూరల్
నానో యూరియాతో రైతులకు అధిక లాభాలు చేకూరుతాయని సోమేశ్వర రైతు సంఘం అధ్యక్షులు డాక్టర్ బైరి రమేష్ గౌడ్ అన్నారు. శనివారం మండలంలోని కొలనుపాక సోమేశ్వర రైతు సంఘం లో రైతులకు నానో యూరియా పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నానో యూరియా వల్ల పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయని,దిగుబడి పెరుగుతుందన్నారు. మెరుగైన పోషక విలువలతో కూడిన పంటలను పండించడానికి నానో యూరియా దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సోమేశ్వర రైతు సంఘం ఉపాధ్యక్షులు శ్యామల మాధవరెడ్డి, బెల్లంకొండ వేణుగోపాల్, కార్యదర్శి చిరబోయిన మల్లేశం, కోశాధికారి గాదే సోమిరెడ్డి, సభ్యులు జూల పాపయ్య, ఏ మల్ల శ్రీనివాస్ రెడ్డి, దొంతిరి శంకర్ రెడ్డి, మద్ది దశరథ రెడ్డి, కోకల అశోక్ తదితరులు ఉన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad