Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఊరురా పనుల జాతర ప్రారంభం..

ఊరురా పనుల జాతర ప్రారంభం..

- Advertisement -

ఇందిరమ్మ రాజ్యంలో అన్ని గ్రామాలు అభివృద్ధి
గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దత్తత నియోజకవర్గం వనపర్తి
వనపర్తి నియోజకవర్గానికి మరో 3500 ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు వినతి
వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి
నవతెలంగాణ – వనపర్తి 

తెలంగాణ రాష్ట్రంలో నేడు పనుల జాతర కార్యక్రమం కొనసాగుతుందని అందులో భాగంగానే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తున్నామని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. శనివారం నియోజకవర్గ పరిధిలోని పెద్దమందడి, వనపర్తి, శ్రీరంగాపురం మండలాల్లో పర్యటించిన ఆయన గ్రామపంచాయతీ కార్యాలయాలను ప్రారంభించి, అంగన్వాడి నూతన భవన నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు. ముందుగా పెద్దమందడి మండల బుగ్గపల్లి తండాలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. నేడు తండాలను గ్రామపంచాయతీలుగా గుర్తించి వాటి పరిపాలన సౌలభ్యం కోసం నూతన గ్రామపంచాయతీ భవనాలను ఏర్పాటు చేయించామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

అనంతరం వెల్టూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడే ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. అడ్డాకల్ మండల పరిధిలో బలిజిపల్లి, కన్మనూర్, చిన్న మునగాళ్ చేడు, పెద్ద మునగాలచేడ్, మూసాపేట్, మండలంలోని మహమ్మద్దుసేన్ పల్లి గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు రేషన్ కార్డులు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వనపర్తి నియోజకవర్గాన్ని దత్తత తీసుకున్నారని ఈ క్రమంలోనే వనపర్తి నియోజకవర్గానికి అదనంగా మరో 3500 ఇండ్లు అదనంగా కావాలని కోరగా అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు , సన్న బియ్యం, ఉచిత కరెంటు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వడ్డీ లేని రుణాలు, రైతు రుణమాఫీ, రైతు భరోసా లాంటి అనేక పథకాలను ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనంతరం స్కూల్ తాండ లో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు. అమ్మపల్లి గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి అంగన్వాడి భవన నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామంలో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం పెద్దగూడెం తండాలో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం నాచహళ్లి గ్రామంలో నూతన అంగన్వాడి భవన నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. శ్రీరంగాపురం మండలం నాగసాని పల్లి గ్రామంలో నూతన ఇందిరమ్మ ఇంటిని నిర్మించు కొన్న గొల్లవాల గోవిందమ్మ గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే దంపతులిద్దరికీ నూతన వస్త్రాలను అందించి అభినందనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఇంటి యజమాని కురుమూర్తి మాట్లాడుతూ సొంత ఇంటిని నిర్మించుకోవాలని ఏళ్ల తెరపడి ఎదురుచూసిన నిర్మించుకోలేకపోయామని నేడు ఇందిరమ్మ రాజ్యంలో మా సొంత ఇంటి కల నెరవేరిందని ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శాసనసభ్యులు మేఘా రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో పెద్దమందడి మండలం వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఉపాధ్యక్షులు రామకృష్ణారెడ్డి, మాజీ జెడ్పిటిసిలు వెంకటస్వామి, రమేష్ గౌడ్, వనపర్తి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య, మాజీ ఎంపీపీ రఘు ప్రసాద్, మణిగిళ్ల తిరుపతిరెడ్డి, నాయకులు సాయి చరణ్ రెడ్డి , వెంకటేశ్వర్ రెడ్డి, రమేష్ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, గట్టు యాదవ్, గోపాల్ నాయక్ఆంజనేయులు, నాయక్, మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు, వనపర్తి మండల మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, శంకర్ నాయక్, వాల్య నాయక్, చంద్రశేఖర్ రెడ్డి, పెబ్బేరు మార్కెట్ యార్డ్ అధ్యక్షురాలు ప్రమోదిని రెడ్డి, ఉపాధ్యక్షులు విజయవర్ధన్ రెడ్డి, శ్రీహరి రాజు, దయాకర్ రెడ్డి, రంజిత్ కుమార్, యుగేందర్ రెడ్డి, బీరం రాజశేఖర్ రెడ్డి, వెంకటయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad