31 నుంచి 40 రోజులకు తీయడంతో బిల్లుల మోత
ప్రజలంతా అధికారులను నిలదీయాలని పిలుపు
నవతెలంగాణ – వనపర్తి
విద్యుత్ ఉద్యోగులు ప్రతినెల కరెంటు మీటర్ కు తీస్తున్న బిల్లులను కరెక్ట్ గా 30 రోజులకే బిల్లులు తీయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం డి జబ్బార్ శనివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. 30 రోజుల తరువాత 31 నుండి 40 రోజుల వరకు బిల్లులు కొట్టి ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 100 యూనిట్స్ స్లాబ్ వరకు యూనిట్ కి 3.60 రూపాయలు. (ఒక్కొక్క యూనిట్ కాస్ట్.). 2 రోజులు delay చేయడం వల్ల 2 రోజులలో 6 యూనిట్స్ తో కలిపి 106 యూనిట్స్ వొచ్చింది. అంటే అప్పుడు 101 యూనిట్స్ దాటితే పర్ యూనిట్ ధర 6.90 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది అన్నారు.
తాను ఇప్పుడు అనవసరంగా 6.90 రూపాయల లెక్క ప్రకారం కట్టాలన్నారు. అప్పుడు 101 × 6.90 = 690 కట్టవలసి వస్తుందన్నారు. 100 యూనిట్స్ కు 390 లకు గానూ 690 కట్టాలన్నారు. 690-390=300 అదనంగా చెల్లించాల్సి వస్తుందన్నారు. ఇది నా ఒక్కడికి జరుగుతున్నది కాదన్నారు.
ఏ ఈ, డి ఈ, ఎస్ ఈ ల ఆధ్వర్యంలో వారి ఆదేశాల ప్రకారమే బిల్లింగ్ ఇలా లేట్ గా తీసి అదనంగా డబ్బులు కట్టేలా చేస్తున్నారన్నారు. ఇలా ప్రతి నెల మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ప్రజలంతా నోరు మూసుకొని బిల్లులు కడుతున్నామన్నారు. ఈ మోసాలను ఆపడానికి ప్రజలు సపోర్ట్ చేయాలని కోరారు. ఈ విషయంపై ప్రతి ఒక్కరూ విద్యుత్ అధికారులతో చర్చించాలని, తద్వారానైనా ఈ సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.