నవతెలంగాణ-హైదరాబాద్ : అనుమానిత లష్కరే తోయిబా ఉగ్రవాది నదిలో దూకి చనిపోయిన ఘటన కలకలం రేపుతోంది. జమ్మూ కాశ్మీర్ లోని కుల్గాం జిల్లాలో జరిగింది ఈ ఘటన. ఆదివారం
(మే 4 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.. ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చిన 23 ఏళ్ళ ఇంతియాజ్ అహ్మాద్ మాగ్రే అనే వ్యక్తి భద్రతా దళాల నుంచి తప్పించుకోబోయి నదిలో దూకి చనిపోయాడు. వ్యక్తి మరణానికి భద్రతా దళాలే కారణమని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే.. అహ్మద్ నదిలో దూకిన వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. దీంతో అతనికి చావుకు భద్రతా దళాలు కారణం కాదని తేలిపోయింది.
పహల్గాం ఉగ్రదాడితో జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా ఉగ్రవాదుల కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టింది సైన్యం. ఈ క్రమంలో భద్రతా దళాల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో నదిలో దూకాడు అహ్మద్. శనివారం ( మే 3 ) అహ్మద్ మాగ్రేను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అహ్మద్ కుల్గాం జిల్లాలోని తంగ్ మార్గ్ అడవిలో ఉన్న ఉగ్రవాదులకు ఆహారం అందించినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు తెలుస్తోంది.
ఈ క్రమంలో ఆదివారం జమ్మూ కశ్మీర్ పోలీసులు, సైన్యం సంయుక్తంగా ఆ ప్రాంతానికి వెళ్తోన్న సమయంలో అహ్మద్ నదిలో దూకినట్లు తెలుస్తోంది.
తప్పించుకోబోయి..నదిలో దూకి చనిపోయిన ఉగ్రవాది..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES