Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుపార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు

పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు

- Advertisement -

– ఎట్టకేలకు స్పీకర్‌ నిర్ణయం
– దశలవారీగా విచారణ
– వచ్చే వారం నుంచే..!
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ నోటీసులు జారీ చేశారు. బీఆర్‌ఎస్‌లో గెలిచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల్లో ఐదుగురికి శుక్రవారం అధికారికంగా నోటీసులు పంపారు. వీరి విచారణ ముగిసిన తర్వాత మరికొందరికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని తెలిసింది. వచ్చే వారం నుంచి వీరి విచారణ ప్రారంభమవుతుందని సమాచారం. బీఆర్‌ఎస్‌కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారనీ, ఫిరాయింపు నిరోధక చట్టం కింద వారిని అనర్హులుగా ప్రకటించాలని దాఖలైన కేసులో మూడు నెలల్లోగా స్పీకర్‌ నిర్ణయం తీసుకోవాలని గత జులై 31న సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దానిపై అడ్వొకేట్‌ జనరల్‌, సీనియర్‌ న్యాయవాదులతో స్పీకర్‌ చర్చించారని సమాచారం. ఆ తర్వాతే ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. కడియం శ్రీహరి, దానం నాగేందర్‌, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సంజరుకుమార్‌, తెల్లం వెంకట్రావు, అరికెపూడి గాంధీ, కాలె యాదయ్య, టి ప్రకాశ్‌ గౌడ్‌, కష్ణమోహన్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డిపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్‌ కోరింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారందరికీ నోటీసులు ఇచ్చి, వివరణ తీసుకొన్న తర్వాత స్పీకర్‌ తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. స్పీకర్‌ నోటీసుల నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏం చేస్తారనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. ఎమ్మెల్యేల్లోనూ చర్చ జరుగుతున్నది.

నోటీసులు అందాయి : కృష్ణమోహన్‌రెడ్డి
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కష్ణమోహన్‌రెడ్డి తనకు నోటీసులు అందాయని చెప్పారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఇచ్చిన ఫిర్యాదులపై వెంటనే వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నట్టు చెప్పారు. నోటీసుపై న్యాయనిపుణులతో మాట్లాడి వివరణ ఇస్తానన్నారు. తాను అసలు పార్టీ మారలేదనీ, సాంకేతికంగా బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని గుర్తు చేశారు. గద్వాల నియోజకవర్గ అభివద్ధి కోసమే తాను సీఎం రేవంత్‌రెడ్డిని కలిశానని చెప్పారు. ఇప్పటికీ తాను బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నానని వివరించారు. నోటీసులు జారీచేసిన స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌, దానికి సంబంధించిన ప్రక్రియను చేపట్టాలని అసెంబ్లీ కార్యదర్శి నరసింహ్మాచార్యులను ఆదేశించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad