Monday, May 5, 2025
Homeజాతీయంరాహుల్‌గాంధీ పౌరసత్వ పిటిషన్‌పై నేడు విచారణ

రాహుల్‌గాంధీ పౌరసత్వ పిటిషన్‌పై నేడు విచారణ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: కాంగ్రెస్‌ ఎంపి, లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ పౌరసత్వ హోదాను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సోమవారం అలహాబాద్‌ హైకోర్టు లక్నో బెంచ్‌ విచారణ చేపట్టనుంది. గత విచారణలో రాహుల్‌ గాంధీ భారతీయ పౌరుడా? కాదా అనే విషయంపై హోం మంత్రిత్వశాఖ సమర్పించిన నివేదిక పట్ల కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. రాహుల్‌గాంధీకి ద్వంద్వ పౌరసత్వం ఉందని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై స్పష్టమైన సమాధానమివ్వాలని.. సవరించిన నివేదిక సమర్పించడానికి ప్రభుత్వానికి 10 రోజులు కోర్టు గడువు ఇచ్చింది. పౌరసత్వ హోదాను నిర్ధారించడానికి సోమవారం కోర్టు విచారణ జరపనుంది. కాగా, రాహుల్‌గాంధీకి యుకె (యునైటెడ్‌ కింగ్‌డమ్‌)లో పౌరసత్వం ఉంది. దీనివల్ల భారత పార్లమెంటులో లోక్‌సభ సభ్యుడిగా అనర్హుడని పేర్కొంటూ దాఖలైన పిటిషన్‌ను కోర్టు విచారించనుంది. రాహుల్‌ గాంధీ భారత్‌లోనూ,యుకెలోనూ రెండు దేశాల పౌరసత్వం కలిగి ఉన్నారు. ఇలా ద్వంద్వ పౌరసత్వ కలిగి ఉండడం భారత చట్టానికి విరుద్దం అని, ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉండడం చట్టం అనుమతించదని పిటిషన్‌ పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -