నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని ఘంటసాల లో గల శ్రీ నీలకంఠేశ్వర ఆలయం నూతన పాలకవర్గాన్ని నియమించారు. ఈ మేరకు శనివారం దేవాదాయ శాఖ సెక్రెటరీ శైలజ రామయ్యర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆలయ ఛైర్మన్గా సిరిగిరి తిరుపతి నియమించారు. అలాగే ఆలయ డైరెక్టర్లుగా నందకిషోర్, మదన్మోహన్, వెంకట్ రెడ్డి, కాటిపల్లి రాజు, నాగనాథరావు, శ్రీనివాస్ గౌడ్, శంకర్, విజయ రాణి, సత్యనారాయణ, క్రాంతి కిరణ్, చంద్రకాంత్, నాగారావు, నర్సింగరావును నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన చైర్మన్ సిరిగిరి తిరుపతి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో నీలకంఠేశ్వర గుడి చైర్మన్ గా నియమించినందుకు నీలకంఠేశ్వర ఆలయా అభివృద్ధికి తన వం తు కృషి చేస్తానని తెలిపారు. నీలకంటేశ్వర ఆలయం చైర్మన్గా తనను నియమించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, మంత్రులకు, టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ కు, సహకరించిన ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి , ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బీన్ హందన్, నుడా చైర్మన్ కేశ వేణు కు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.
శ్రీ నీలకంఠేశ్వర ఆలయం చైర్మన్ గా సిరిగిరి తిరుపతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES