నవతెలంగాణ – (వేల్పూర్ )ఆర్మూర్
మండలంలోని కుకునూరు ఉన్నత పాఠశాలలో విద్యార్థులు తెలుగు భాషలో చక్కని ప్రావీణ్యతను కనబరుస్తున్నారు. పాఠశాల స్కూల్ అసిస్టెంట్ తెలుగు భాషోపాధ్యాయుడు పతాని గంగాధర్ తెలుగు సబ్జెక్టును చక్కగా బోధిస్తున్నారు. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ ద్వారా విద్యార్థులకు చక్కని అవగాహన కల్పించడంతో స్పందించిన 8వ తరగతి విద్యార్థిని బి భువనేశ్వరి నేడు శతక మధురిమ అనే పాఠ్యాంశంలోని ఒక పద్య పాదమును ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్ బోర్డుపై చక్కగా గురు, లఘు వులను గుర్తించి,గణ విభజన చేసి, ఉపాధ్యాయులు విద్యార్థులచే ప్రశంసలు అందుకుంది.
2024 -25 బ్యాచుకు చెందిన పదవ తరగతి సంవత్సరాంత పరీక్షలలో తెలుగు సబ్జెక్టులో సహస్ర అనే పదవ తరగతి విద్యార్థిని 100మార్కులకు గాను 99 మార్కులు సాధించడంతో త్రిబుల్ ఐటీ రావడానికి మార్గం సుగమమైంది. తెలుగు భాష పట్ల మక్కువను కల్పిస్తూ, విద్యార్థులకు ఉత్తమ విద్యా బోధన చేస్తున్న తెలుగు భాషో పాధ్యాయుడైన పతాని గంగాధర్ ను ప్రధానోపాధ్యాయులు శ్రీ టి హరిచరణ్ ఉపాధ్యాయ బృందం అభినందించారు.
తెలుగు సబ్జెక్టులో ప్రతిభ చాటుతున్న విద్యార్థులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES