No menu items!
Monday, August 25, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeతెలంగాణ రౌండప్రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మెడికల్ క్యాంప్

రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మెడికల్ క్యాంప్

- Advertisement -

రోటరీ జిల్లా న్యూ జనరేషన్స్ రీజినల్ చైర్మన్ ఆకుల అశోక్..
నవతెలంగాణ – డిచ్ పల్లి

డిచ్ పల్లి మండల కేంద్రంలోని మానవతా సదన్ (బాల బాలికల వసతి సముదాయం) లో విద్యార్థులకు కంటి ,దంతా మరియు చర్మ సంబంధిత ఉచిత మెగా ఆరోగ్య శిబిరాన్ని రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్, ఇన్నర్ విల్ క్లబ్ ఆఫ్ ఇందుర్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్లు రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ అధ్యక్షులు శ్యాం అగర్వాల్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రోటరీ జిల్లా 3150 న్యూ జనరేషన్స్ రీజినల్ చైర్మన్ ఆకుల అశోక్ హాజరై విద్యార్థులు ఉద్దేశించి మాట్లాడుతూ.. నీటి టెక్నాలజీ జనరేషన్లో విద్యార్థులే కాకుండా పెద్దలు కూడా ఆరోగ్యంపై కనీస అవగాహన లేక అనేక రకాల అనారోగ్యాలకు గురవుతున్నారని పేర్కొన్నారు.

పురాతన రోజులలో ఆరోగ్యమే మహాభాగ్యం అను నానుడి సత్యమైనదని దాని వైపు అందరూ పయనించాలని పౌష్టికమైన ఆహారాన్ని భుజిస్తూ తగ్గిన వ్యాయామం చేస్తూ రోజు దినచర్యలో మన యొక్క ఆరోగ్యం పై కనీస జాగ్రత్త అవగాహన ఉంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు కంటి పరీక్షలను ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ పిబి. కృష్ణమూర్తి, చర్మ సంబంధిత పరీక్షలను ప్రముఖ స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్ మానస వైద్యత, దంత సమస్యల డాక్టర్ ఆకుల సాయి రోహిత్, డాక్టర్ స్ఫూర్తి లు విద్యార్థులకు పరీక్షలు చేసి అవసరమైన టూత్ బ్రష్లు, పేస్ట్ , మందులను, మరియు ఆయింట్మెంట్లను ఉచితంగా అందజేశారు.ఈ కార్యక్రమంలో రోటరీ సభ్యులు కోశాధికారి జుగల్ జాజు, విజయ రావు, బాబు రావు, సతీష్ షా, జుగల్ సోనీ, జ్ఞాన ప్రకాష్, జితేంద్ర మలాని, బీనా అగర్వాల్, ఆస్పత్రి సిబ్బంది, మానవత సదన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad