నవతెలంగాణ – జక్రాన్ పల్లి
జక్రాన్ పల్లి మండలంలోని కలిగోటు స్కూల్ ప్రిన్సిపల్ గంగారెడ్డి కి హైదరాబాద్ ఎడ్యుటెక్ ఎక్స్పో 2025 వారు నిర్వహించిన శ్రీ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ నేషనల్ అవార్డు కార్యక్రమం హైదరాబాదులో జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ గంగారెడ్డి ని సర్వేపల్లి రాధాకృష్ణ అవార్డుతో సత్కరించడం జరిగింది. గంగారెడ్డి మాట్లాడుతూ .. సిద్ధార్థ పాఠశాల గ్రామీణ ప్రాంతంలో స్థాపించి 21 సంవత్సరాల కాలం ఎంతోమంది ఉత్తమ విద్యార్థిని విద్యార్థులను భావి భారత పౌరులుగా తయారు చేస్తూ చదువుతోపాటు చిన్న వయసు నుండి దేశం పట్ల, దైవం పట్ల, మాతృపితృ భక్తిని నేర్పిస్తూ సమాజం పట్ల కృతజ్ఞ భావాన్ని నిర్మిస్తూ క్రమశిక్షణతో కూడినటువంటి విద్యను అందిస్తూ తల్లిదండ్రులు గర్వపడేలా నిరంతరం శ్రమించడంలో ఉపాధ్యాయ బృందం ఉత్సాహంగా ముందు వెళ్లడం జరుగుతుందని తెలిపారు.
మునుముందు ఉన్నత ఆశయాలతో ఎదిగేటందుకు మా ప్రయత్నం నిరంతరం కొనసాగుతుందని మా పాఠశాల పైన ఉన్నటువంటి నమ్మకంతో చదివిస్తున్నటువంటి తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టుకొని విద్యార్థులు నైపుణ్యాలను వెలికి తీయడంలో ఉపాధ్యాయ బృందంతో పాటు తల్లిదండ్రుల యొక్క ప్రోత్సహం కూడా మరువలేనిదని , సర్వేపల్లి రాధాకృష్ణన్ జాతి అవార్డు రావడం ఎంతో ఉత్సాహాన్ని కలిగించిందని ,మరింత బాధ్యతతో ముందుకు వెళ్లడానికి దోహదపడుతుందని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిద్ధార్థ పాఠశాల కరస్పాండెంట్ స్రవంతి గంగారెడ్డి గ మరియు వైస్ ప్రిన్సిపల్స్ లత, శశి ప్రియ మరియు అకాడమీకి ఇంచార్జ్ మానస టీచర్ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొనడం జరిగింది
సిద్ధార్థ పాఠశాల ప్రిన్సిపాల్ గంగారెడ్డికి జాతీయ సర్వేపల్లి రాధాకృష్ణ అవార్డు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES